
Indian Railways: భారతీయ రైల్వేలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు RAC అనే పదం ఎదురవుతుంటుంది. అసలు RAC టికెట్ ఉన్నవారు రైలు ఎక్కవచ్చా? పూర్తి బెర్త్ దొరుకుతుందా లేదా? అనే సందేహాలకు రైల్వే అధికారులు స్పష్టతనిచ్చారు.
RAC అంటే ‘రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్’ (Reservation Against Cancellation). ఒక రైలులో కన్ఫర్మ్‌డ్ బెర్త్‌లన్నీ పూర్తయిన తర్వాత, పరిమిత సంఖ్యలో ప్రయాణికులకు కూర్చోవడానికి సీటు కేటాయించే పద్ధతి ఇది.
RAC టికెట్ కలిగిన ప్రయాణికుడు తప్పకుండా రైలు ఎక్కి ప్రయాణించవచ్చు. సైడ్ లోయర్ బెర్త్ (Side Lower Berth) ఒక్కదానిని ఇద్దరు RAC ప్రయాణికులకు పంచుకోవడానికి కేటాయిస్తారు. అయితే మొదటి దశలో పడుకోవడానికి పూర్తి బెర్త్ గ్యారెంటీ ఉండదు.
సీట్లు ఖాళీ అయ్యే దానిని బట్టి ఆర్‌ఏసీ టికెట్ కన్ఫర్మ్‌డ్ (CNF)గా మారే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే, వారి స్థానంలో RAC ఉన్నవారి హోదా మెరుగుపడుతుంది. ఉదాహరణకు బుకింగ్ సమయంలో ఆర్‌ఏసీ 25 ఉంటే అది ప్రయాణ సమయానికి RAC 10, RAC 2 లేదా పూర్తిగా CNF (కన్ఫర్మ్) అయ్యే అవకాశం ఉంది. టికెట్ పూర్తిగా కన్ఫర్మ్ అయితే ప్రయాణికుడికి ఒక పూర్తి బెర్త్ కేటాయిస్తారు.
ఫైనల్ రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత కూడా టికెట్ ఆర్‌ఏసీ స్టేటస్‌లోనే ఉంటే ప్రయాణికుడు అదే టికెట్‌తో రైలులో ప్రయాణించవచ్చు. ప్రయాణంలో ఇద్దరు ప్రయాణికులు ఒకే బెర్త్‌ను కూర్చోవడానికి పంచుకోవాల్సి ఉంటుంది. అయితే చార్ట్ తయారైన తర్వాత మాత్రమే ఆర్ఏసీలో ఏ బెస్త్ అనేది తెలుస్తుంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికుడు రైలు ఎక్కకపోతే లేదా మధ్యలో దిగిపోతే, రైలులోని TTE (రైల్వే చెకింగ్ సిబ్బంది) సీనియారిటీ ఆధారంగా ఆ ఖాళీ బెర్త్‌ను RAC ప్రయాణికుడికి కేటాయిస్తారు.
CNF (Confirmed)- మీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు అర్థం. మీకు పూర్తి బెర్త్ లభించినట్లు. RAC అంటే రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్. కూర్చోవడానికి సీటు ఉంటుంది. WL (Waiting List) – మీ బుకింగ్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు. ఇక మీకు సీటు కేటాయించలేదని అర్థం. చార్ట్ పూర్తయ్యాక కూడా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే (ఇ-టికెట్ అయితే) ప్రయాణించేందుకు అనుమతి ఉండదు.
ఇది కూడా చదవండి: AI Washing Machine: ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!