Indian Railways: S1, B1, HA1 రైలు కోచ్ కోడ్‌ల అర్థం మీకు తెలుసా? పూర్తి వివరాలు మీకోసం!

Indian Railways Information: రైలులో ప్రయాణించేటప్పుడు కోచ్‌లపై ఉండే కోడ్‌ల అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. S1, S2 వంటివి సాధారణ స్లీపర్ క్లాస్‌ను సూచిస్తే, B1, B2 వంటివి ఏసీ 3-టైర్ కోచ్‌లను సూచిస్తాయి. కాస్త ప్రైవసీ కోరుకునే వారి కోసం A1 (2-టైర్ ఏసీ), విలాసవంతమైన ప్రయాణం కోసం H1 (ఫస్ట్ క్లాస్ ఏసీ) కోచ్‌లు ఉంటాయి. ఇవే కాకుండా సామాన్యుల కోసం GS కోడ్‌తో జనరల్ కోచ్‌లు ఉంటాయి. రైలు కోచ్‌పై కనిపించే కోడ్‌ల అర్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Indian Railways: S1, B1, HA1 రైలు కోచ్ కోడ్‌ల అర్థం మీకు తెలుసా? పూర్తి వివరాలు మీకోసం!
Indian Train Coach Codes Decoded

Updated on: May 12, 2026 | 1:02 PM

మనం రైలులో ప్రయాణించేటప్పుడు రైలు కోచ్‌లపై S1, B1, HA1 వంటి రకరకాల కోడ్‌లను చూస్తుంటాము. రైలు కోచ్‌పై ఉండే కోడ్‌లు ఆ కోచ్ ఏ రకానికి చెందినది? అందులో ఉండే సౌకర్యాలు ఏంటి? అనేది సూచిస్తాయి. ఏ కోచ్ కోడ్ దేన్ని సూచిస్తుందని కొందరికి మాత్రమే అవగాహన ఉంటుంది. రైలు ప్రయాణీకులు తప్పక తెలుసుకోవాల్సిన అంశమిది. మీ రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే ఈ కోడ్‌ల వెనుక ఉన్న అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన కోచ్ కోడ్‌లు, వాటి అర్థాలు:

  1. GS (జనరల్ కోచ్): వీటిని సాధారణ కోచ్‌లు అంటారు. వీటికి రిజర్వేషన్ అవసరం లేదు. ముందు వచ్చిన వారికి ముందు సీటు పద్ధతిలో ఇందులో సీటింగ్ పొందే అవకాశం ఉంటుంది. సీట్లు భర్తీ అయితే ఇతర ప్రయాణీకులు నిల్చొనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
  2. S1, S2 (స్లీపర్ క్లాస్): ఇవి నాన్-ఏసీ (Non-AC) స్లీపర్ కోచ్‌లు. సాధారణంగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు అత్యధికంగా వీటిలోనే ప్రయాణిస్తుంటారు. దూరపు ప్రయాణాలు చేసే రైళ్లలో ఎక్కువగా ఈ కోచ్‌లే ఉంటాయి.
  3. B1, B2 (ఏసీ 3-టైర్): ఇవి త్రీ-టైర్ ఏసీ కోచ్‌లు. ఇందులో ఒక వైపు మూడు బెర్తులు ఉంటాయి. వీటికి తెరలు (curtains) కూడా ఉంటాయి.
  4. A1, A2 (ఏసీ 2-టైర్): ఇవి టూ-టైర్ ఏసీ కోచ్‌లు. ఇందులో ఒక వైపు కేవలం రెండు బెర్తులు మాత్రమే ఉంటాయి. తద్వారా ప్రయాణికులకు ఎక్కువ స్థలం(స్పేస్)తో పాటు ప్రైవసీ లభిస్తుంది.
  5. H1 (ఫస్ట్ క్లాస్ ఏసీ): ఇది అత్యంత ఖరీదైన కోచ్. ఇందులో ప్రైవేట్ క్యాబిన్ లాంటి అనుభవం ఉంటుంది. ఇందులో రెండు లేదా నాలుగు బెర్తుల సెటప్ ఉంటుంది.
  6. HA1 (హైబ్రిడ్ కోచ్): ఇది ఒక ప్రత్యేకమైన కోచ్. ఇందులో సగం ఫస్ట్ ఏసీ, మిగిలిన సగం సెకండ్ ఏసీ సౌకర్యాలు ఉంటాయి.
  7. D1 నుండి D5 (ఏసీ చైర్ కార్): ఇవి కూర్చుని ప్రయాణించే ఏసీ కోచ్‌లు. శతాబ్ది వంటి రైళ్లలో ఇవి ఉంటాయి. ఇవి విమానంలో ఉండే సీటింగ్ లాగా ఉండి పగటిపూట ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటాయి.
  8. SLR (సీటింగ్ కమ్ లగేజ్ రేక్): ఈ కోచ్‌లో ఒక భాగం గార్డ్ కోసం.. మరో భాగం ప్రయాణికుల సామాను లేదా దివ్యాంగుల కోసం కేటాయించబడుతుంది.
  9. EOG (ఎండ్ ఆన్ జనరేటర్): ఇది రైలు చివరన ఉంటుంది. ఇది మొత్తం రైలుకు, ముఖ్యంగా ఏసీ కోచ్‌లకు పవర్ సప్లై అందిస్తుంది.

వచ్చే సారి మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు మీ కోచ్ పైన ఉన్న కోడ్‌ను చూసి, అది ఏ రకమైన కోచ్‌ అనేది సులభంగా గుర్తుపట్టవచ్చు.

Follow Us