Indian Railways: రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్‌న్యూస్.. ఇక రైలులో ఈ సదుపాయం కూడా!
Indian Railways: భారతీయ రైల్వే తాజాగా బెడ్ షీట్ల సేవలో భారీ మార్పు చేసింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్ కోచ్ ప్రయాణికులకు బెడ్ షీట్లు, దిండ్లు అందుబాటులోకి వస్తాయి. ఇది చెన్నై డివిజన్‌లోని సదరన్ రైల్వే ప్రాంతంలో..

చాలా మంది రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. రైళ్లు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. మీరు ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తే ఎటువంటి సమస్య లేదు. భారతీయ రైల్వేలు మీకు బెడ్‌రోల్స్‌ను అందిస్తాయి. అయితే దీనిపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. స్లీపర్ క్లాస్‌లో బెడ్‌రోల్ పొందడం సాధ్యమేనా? మీకు బెడ్‌రోల్ లభించకపోతే ఏమి చేయాలి?
రైల్వే అందించే బెడ్‌రోల్‌లో 2 దిండ్లు, 2 బెడ్‌షీట్లు, 1 దుప్పటి ఉంటాయి. ఒక టవల్ కూడా అందిస్తారు. ఫాస్ట్ AC, సెకండ్ AC, థర్డ్ AC అన్ని కోచ్‌లకు ఈ బెడ్‌రోల్ ఇస్తారు. అయితే, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో బెడ్‌రోల్ పొందడానికి మీరు అదనంగా రూ. 25 చెల్లించాలి. ఒక వార్తా సంస్థ ప్రకారం, స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు బెడ్ రోల్ లభిస్తుంది. అయితే, ఈ సౌకర్యం కొన్ని రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. అలాంటప్పుడు ప్రయాణీకులు అదనపు ఖర్చును భరించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
భారతీయ రైల్వే తాజాగా బెడ్ షీట్ల సేవలో భారీ మార్పు చేసింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్ కోచ్ ప్రయాణికులకు బెడ్ షీట్లు, దిండ్లు అందుబాటులోకి వస్తాయి. ఇది చెన్నై డివిజన్‌లోని సదరన్ రైల్వే ప్రాంతంలో మొదటిసారిగా అమలు చేయనున్నారు. ఇక్కడ ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని డిమాండ్ మేరకు పొందుతారు. ఇది వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది. చలికాలంలో నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లో ప్రయాణించేవారు బెడ్‌షీట్లను అద్దెకు తీసుకుంటారు. 2023-24లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలుచెయ్యగా ప్రయాణికుల నుంచి భారీ స్పందన వచ్చింది.

ఇప్పుడు మరో ప్రశ్న ఏంటంటే.. రైలు కోచ్‌లో ఆ బెడ్ షీట్ అద్దె ఎంత ఉంటుంది అని. దీని రైల్వే శాఖ.. ఫిక్స్‌డ్ ఛార్జీలు పెట్టింది. బెడ్ షీట్ కావాలంటే రూ.20 చెల్లించాలి. దిండు కవర్ కావాలంటే రూ.30 చెల్లించాలి. రెండూ కావాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. వీటిని రాత్రి ఇస్తారు. మార్నింగ్ తిరిగి తీసుకుంటారు. ఇవి ఉచితం కాదు. వీటిని పొందాలంటే.. తప్పనిసరిగా టికెట్ చూపించాలి. ఎందుకంటే.. రిజర్వేషన్ లేని జనరల్ బోగీల్లో ప్రయాణించేవారికి ఈ సేవ అందుబాటులో లేదు.
ఇది కూడా చదవండి: 5 Day Week for Banks: 2026లో బ్యాంకుల పని దినాలు వారానికి 5 రోజులేనా?
ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే సంపద తరిగిపోవడానికి ఏన్నేళ్లు పడుతుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








