Indian Railways: ఎక్కడపడితే అక్కడున్నా రైల్వే వస్తువులు ఎందుకు చోరీ కావు! వాటిని దొంగిలిస్తే ఏం అవుతుంది..?

భారతీయ రైల్వే ట్రాక్‌లు నిర్జన ప్రదేశాలలో ఉన్నా దొంగిలించబడవు. ప్రతి రైల్వే భాగంపై ప్రత్యేక సంఖ్యలు, కోడ్‌లు ఉండటంతో గుర్తించడం సులువు. రైల్వే వస్తువుల దొంగతనానికి కఠినమైన జైలు శిక్షలుంటాయి. దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా నేరమే. ఈ చట్టపరమైన నిబంధనలు, పెరిగిన అవగాహన కారణంగా రైల్వే ట్రాక్‌లు సురక్షితంగా ఉంటున్నాయి.

Indian Railways: ఎక్కడపడితే అక్కడున్నా రైల్వే వస్తువులు ఎందుకు చోరీ కావు! వాటిని దొంగిలిస్తే ఏం అవుతుంది..?
Indian Railways Track

Updated on: Jan 22, 2026 | 9:30 PM

ఇండియన్‌ రైల్వేస్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. లక్షల కిలో మీటర్ల ట్రాక్‌లు మన దేశంలో ఉన్నాయి. అయితే కేవలం రైల్వే స్టేషన్‌లలోనే రైల్వే పోలీసులు ఉంటారు. కానీ జనసంచారం లేని ప్రాంతంలో కూడా రైల్వే ట్రాక్‌ ఉంటుంది. అయినా కూడా ఆ ట్రాక్స్‌ చోరీ అవ్వవు. లోహానికి మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ వాటిని ఎవరూ కూడా దొంగిలించరు. సెక్యూరిటీ లేనప్పటికీ రైల్వే ట్రాక్‌లోని పట్టాలు ఎందుకు చోరీ కావో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నిర్జన ప్రదేశాలలో కూడా ఇనుప రైల్వే ట్రాక్ విడిభాగాలు అక్కడ పడి ఉండటం మీరు చూడవచ్చు. కొన్ని ప్రదేశాలలో రైల్వేలకు చెందిన ఇనుము చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది. కానీ ఈ ఇనుము ఎవరూ దానిని దొంగిలించడానికి ధైర్యం చేయరు. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. ఏమిటంటే రైల్వే శాఖకు చెందిన ప్రతి ఇనుప ముక్కపై ప్రత్యేక సంఖ్యలు ఉంటాయి. దానికి ఒక కోడ్ నంబర్, ఒక చిహ్నం ఉంటాయి. ఈ కోడ్‌లు సామాన్యులకు అర్థం కావు. అందువల్ల రైల్వే ట్రాక్ లేదా రైల్వే శాఖకు చెందిన ఏదైనా ఇతర వస్తువు దొంగిలించబడితే, దానిని వెంటనే పట్టుకుంటారు.

దీనితో పాటు ఏదైనా రైల్వే వస్తువులు చోరీకి గురై పట్టుబడితే కఠిన శిక్ష విధించే నిబంధన చట్టంలో ఉంది. రైల్వే పోలీసులు లేదా రైల్వే పరిపాలన దీనిని గమనించినట్లయితే, చట్టం ప్రకారం చర్య తీసుకుంటారు. ఈ చర్యలో దోషిగా తేలితే, ఒకరు చాలా సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. అందుకే రైల్వే వస్తువులు దొంగిలించబడవు. ఎవరైనా ధైర్యం చేసి వాటిని దొంగిలించినా వాటిని బయట ఎవరూ కొనుగోలు చేయరు. ఎందుకంటే రైల్వే వస్తువులను కొనడం కూడా నేరమే. దొంగ నుంచి కొనుగోలు చేసినా.. అధికారులు వ్యాపారి వద్ద వాటిని గుర్తిస్తే అతన్ని కూడా అరెస్ట్‌ చేస్తారు. గతంలో రైల్వే వస్తువులు బాగా చోరీ జరిగేవి. కానీ వాటిని దొంగతనం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందో అనే అవగాహన పెరిగి రైల్వే వస్తువులను ఇప్పుడు ఎవరూ ముట్టుకోవడం లేదు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి