పండగల సమయంలో రైళ్లు రద్దీగా ఉంటాయి. రైలు ప్రయాణం చేసేటప్పుడు నియమ నిబంధనలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా? సాధారణం రైలు ప్రయాణం చేసేవారు వివిధ రకాల వస్తువులను వెంట తీసుకెళ్తారు. కానీ కొన్ని వస్తువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు నిషేధం ఉంది. అలాంటి వస్తువులతో మీరు పట్టుబడితో జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలి..? ఎలాంటివి తీసుకెళ్లకూడదో ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలులో టపాకాయలు, మెరుపులు వంటి మండే వస్తువులను తీసుకెళ్లడంపై కఠిన నిషేధం ఉంది. ఈ నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణికులు ఎలాంటి పటాకులను తీసుకెళ్లకూడదు. నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తున్నట్లు తేలితే, అతను రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది. దీని కింద రూ.1,000 జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.
ఇది కూడా చదవండి: Bank Working: బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులు మాత్రమే పని.. 2 రోజుల సెలవు నిబంధన ఎప్పటి నుంచి..?
మీరు నివసిస్తున్న చోట పటాకులు, ఇతర పేలుడు పదార్థాలు చౌకగా లభిస్తే, దీపావళికి వాటిని ఇంటికి తీసుకెళ్లాలని మీరు అనుకుంటే జాగ్రత్తగా ఉండటం మంచిది. రైలులో నిషేధిత వస్తువులతో పట్టుబడితే పెద్ద చిక్కుల్లో పడవచ్చు. ప్రతిసారీ భారతీయ రైల్వే కూడా పటాకులతో ప్రయాణించవద్దని పదే పదే ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది.
3 సంవత్సరాల శిక్ష విధించవచ్చు:
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణ సమయంలో ఒక ప్రయాణీకుడు ఏదైనా నిషేధిత వస్తువులను తీసుకువెళితే, అతనిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద ప్రయాణీకుడికి రూ.1000 జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. పటాకులు నిషేధిత వస్తువుల కేటగిరీ కిందకు వస్తాయి కాబట్టి, రైలులో వీటిని పట్టుకుంటే మీరు శిక్షకు గురవుతారు. రైలు ప్రయాణీకుల భద్రతకు హాని కలిగించే అనేక వస్తువులను రైలులో తీసుకెళ్లడాన్ని రైల్వే నిషేధించింది. ఇవి రైలులో అగ్ని ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది.
ఈ వస్తువులు నిషేధం
స్టవ్‌లు, గ్యాస్ సిలిండర్‌లు, ఏ రకమైన మండే రసాయనాలు, బాణసంచా, యాసిడ్, దుర్వాసన వచ్చే వస్తువులు, తోలు, ప్యాకేజ్‌లలో తెచ్చిన నూనె లేదా గ్రీజు వంటి ప్రయాణికులకు నష్టం కలిగించే వస్తువులు రైలు ప్రయాణ సమయంలో నిషేధించింది రైల్వే. నిబంధనల ప్రకారం.. రైలులో ప్రయాణికులు 20 కిలోల వరకు నెయ్యి తీసుకెళ్లవచ్చు. అయితే నెయ్యిని సరిగ్గా టిన్ బాక్స్‌లో ప్యాక్ చేయాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Ratan TATA: 9000 కోట్లు విరాళంగా ఇచ్చిన రతన్ టాటానే రూ.15 కోట్లు లంచం డిమాండ్ చేశారట.. ఎందుకో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి