Indian Railways: రైలులో ఒక టికెట్‌పై ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చు..? పరిమితికి మించి ఉంటే భారీ జరిమానా!

దేశంలో పండుగ సీజన్ కొనసాగుతోంది. దీపావళి, ఛత్ పూజ సమయం దగ్గర పడుతోంది. పండగ సీజన్‌ ఉండటంతో ప్రయాణికుల రద్దు అధికంగా ఉంటుంది. ఇప్పటికే ప్రజలు రైలు టిక్కెట్లు..

Indian Railways: రైలులో ఒక టికెట్‌పై ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చు..? పరిమితికి మించి ఉంటే భారీ జరిమానా!
Indian Railway Rule 2022

Updated on: Oct 19, 2022 | 9:54 AM

దేశంలో పండుగ సీజన్ కొనసాగుతోంది. దీపావళి, ఛత్ పూజ సమయం దగ్గర పడుతోంది. పండగ సీజన్‌ ఉండటంతో ప్రయాణికుల రద్దు అధికంగా ఉంటుంది. ఇప్పటికే ప్రజలు రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ప్రయాణాల్లో అందరి వద్ద లగేజీ ఉంటుంది. రైలులో ప్రయాణికుడు ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చో తెలుసా..? ఇది తరగతిని బట్టి మారుతూ ఉన్నప్పటికీ.. రైలులో తనిఖీ చేస్తున్నప్పుడు, మీరు నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ వస్తువులను తీసుకెళ్లినట్లయితే మీరు భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

రైలులో స్లీపర్ కోచ్, టైర్-2 కోచ్, ఫస్ట్ క్లాస్ కోచ్‌లలో లగేజీని తీసుకెళ్లడానికి భారతీయ రైల్వే బోర్డు నిబంధనలను రూపొందించింది. మీరు నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే వస్తువులను తీసుకెళ్లవచ్చు. మీ టికెట్‌ను బట్టి లగేజీ బరువును నిర్ధారిస్తారు రైల్వే అధికారులు. మీరు ఇంతకంటే ఎక్కువ లగేజీని తీసుకువెళితే మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణికుడు స్లీపర్ కోచ్‌లో 40 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఉంటే, 80 కిలోల వరకు సామాను తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితి ప్రతి ప్రయాణికుల ప్రాతిపదికన ఉంటుంది. అదే సమయంలో టైర్-2 కోచ్‌లో, ఒక ప్రయాణికుడు 50 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చు. ఫస్ట్ క్లాస్‌లో ఈ పరిమితి మరింత ఎక్కువ అవుతుంది. ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే వారు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. ఏ ప్రయాణికుడు ఇంతకంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్లలేరు.

ఇవి కూడా చదవండి

పెనాల్టీ నియమం ఏమిటో తెలుసుకోండి

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుడు పరిమితికి మించి ఎక్కువ సామాను తీసుకువెళితే అతను 500 కి.మీ వరకు ప్రయాణానికి రూ. 600 కంటే ఎక్కువ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దూరం ఆధారంగా ఈ జరిమానా నిర్ణయించబడుతుంది. ఎక్కువ లగేజీ ఉంటే లగేజీ కంపార్ట్‌మెంట్‌లో జమ చేసి దాని ప్రకారం డబ్బులు చెల్లించాలి. అలా చేయకుంటే జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us