
Gas Cylinder Customers: మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా ? అయితే అది ఏ కంపెనీ సిలిండర్. ఒక వేళ మీరు ఇండెన్ గ్యాస్ కస్టమర్లు అయితే.. మీకు అదిరిపోయే శుభవార్త. అవును నిజంగానే గుడ్ న్యూస్. ఇండేన్ గ్యాస్ వాడుతున్న వారికి ఆ సంస్థ ఊరట కలిగించే ప్రకటన చేసింది. కొత్త గ్యాస్ సిలిండర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి పేరు ఇండేన్ ఎక్స్ ట్రా తేజ్ సిలిండర్లు. వీటి వలన రెండు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇండేన్ ఎక్స్ట్రా తేజ్ సిలిండర్ వాడటం వల్ల 5 శాతం వరకు గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. అంతే కాకుండా.. వంట త్వరగా పూర్తవుతుంది. ఇవి బ్లూ కలర్ లో ఉంటాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండోయ్. ఈ సిలిండర్లు అందరికి కాదు. కేవలం కమర్షియల్ సిలిండర్ ఉపయోగించే వారు మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. (Indane Gas)
అంటే అర్థమైందా.. ఈ గ్యాస్ సిలిండర్లను ఇంట్లో ఉపయోగించుకోవడం కుదరదు. ఇవి 14.2 కేజీల సిలిండర్స్ రూపంలో అందుబాటులో లేవు. ఇండియన్ ఆయిల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సిలిండర్లు గ్యాస్ ను ఎక్కువ ప్రెజర్తో పంపిస్తుంది. దీంతో గ్యాస్ 5 శాతం వరకు ఆదా అవుతుంది. ఇంక వంట త్వరగా పూర్తవుతుంది. దీంతో కుకింగ్ టైం 14 శాతం వరకు ఆదా అవుతుంది. అలాగే 19 కేజీలు, 47.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వాడే వారు వీటిని పొందోచ్చు. ఇందుకోసం మీరు మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరి నుంచి గ్యాస్ సిలిండర్లను తీసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే ఈ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజులు దేశవ్యాప్తంగా ఈ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి.
ట్వీట్..
పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…