Indian Currency: భారత కరెన్సీ చివరలో ఈ నాలుగు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఆసక్తికర విషయాలు

|

Apr 18, 2023 | 10:28 AM

మన జీవితంలో ముఖ్య పాత్ర పోషించేది డబ్బు. ఇది ఏమైనా చేయిస్తుంది. డబ్బులో అవసరం లేనివాడు అంటూ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బు కోసమే. జీవితం ముందుకు సాగాలంటే డబ్బు ఎంతో ముఖ్యం. అయితే భారత కరెన్సీ నోట్లపై ఎన్నో రకాల సమాచారం ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్‌ సంతకం నుంచి..

Indian Currency: భారత కరెన్సీ చివరలో ఈ నాలుగు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఆసక్తికర విషయాలు
India Currency Symbol
Follow us on

మన జీవితంలో ముఖ్య పాత్ర పోషించేది డబ్బు. ఇది ఏమైనా చేయిస్తుంది. డబ్బులో అవసరం లేనివాడు అంటూ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బు కోసమే. జీవితం ముందుకు సాగాలంటే డబ్బు ఎంతో ముఖ్యం. అయితే భారత కరెన్సీ నోట్లపై ఎన్నో రకాల సమాచారం ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్‌ సంతకం నుంచి వివిధ రకాల కోడ్స్‌, భాషలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్‌ ఉంటుంది. అయితే నోట్లపై ఉండే సమాచారం గురించి ఎవరికైనా తెలుసా..? నోట్లపై నాలుగు లైన్లు ఉంటాయి. అది ఎప్పుడైనా గమనించారా? అసలు ఆ లైన్స్ ఎందుకు ఉంటాయో అని మీకెప్పుడైన ఆలోచన వచ్చిందా..? ఆ లైన్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం.

భారత కరెన్సీపై ఆ నాలుగు గీతలను బ్లీడ్ మార్క్స్ అని అంటారు. వీటిని దృష్టిలో లోపం ఉన్న వారికోసం ప్రత్యేకంగా నోట్లపై ముద్రిస్తారు. ఎందుకంటే ఈ లైన్ లో టచ్ చేసి అది ఎంత నోటు అనే విషయాన్ని చెప్పగలరట. అయితే 100, 200, 500, 2000 నోట్లపై వేర్వేరు రకాల లైన్స్ ఉంటాయి. వంద రూపాయల నోటు రెండు వైపులా నాలుగు లైన్లు ఉంటాయి. 200 నోటు కూడా అలాగే ఉంటుంది. అయితే దానికి రెండు సున్నాలను కూడా యాడ్‌ చేశారు. ఇక 500 నోటు ఐదు గీతలు, 2000 నోటు 7 లైన్లు ఉంటాయి. అందులో ఈ గీతలు సహాయంతో నోటు విలువను అర్థం చేసుకుంటారని బ్యాంకు అధికారుల నుంచి సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి