Palm Oil: సామాన్యులకు షాకిచ్చిన కేంద్రం.. మళ్లీ పెరగనున్న వంట నూనె ధరలు!

|

Nov 02, 2022 | 5:50 AM

గతంలో వంట నూనె ధరలు షాకిచ్చాయి. నిత్యావసర సరుకుల ధరతో పాటు వంట నూనె ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో..

Palm Oil: సామాన్యులకు షాకిచ్చిన కేంద్రం.. మళ్లీ పెరగనున్న వంట నూనె ధరలు!
Oil Price
Follow us on

గతంలో వంట నూనె ధరలు షాకిచ్చాయి. నిత్యావసర సరుకుల ధరతో పాటు వంట నూనె ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ ధరలు పెరగడం సామాన్యుడి జేబుకు చిల్లులు పడేలా చేశాయి. తర్వాత కేంద్రం అప్రమత్తమై వంట నూనె ధరలు దిగి వచ్చేలా చేశాయి. దాదాపు రూ.200 వరకు ఉన్న ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రం. ఆయిల్‌పై దిగుమతి సుంకాలు పెంపు నిర్ణయం కారణంగా వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కందుల గింజల ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని కేంద్రం చెబుతోంది.

ముడి పామాయిల్‌ దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952 డాలర్లకు పెరిగింది. ఆర్బీడీ పామాయిల్‌ దిగుమతి సుంకం టన్నుకు 905 డాలర్ల నుంచి 962 డాలర్లకు పెరిగింది. ఇక ఇతర పామాయిల్‌ టారిఫ్‌ కూడా పెరిగింది. టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు ఎగిసింది.
అయితే ఈ ఏడాది ప్రారంభంలో ధరల నియంత్రనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి ట్యాక్స్‌ను రద్దు చేసింది. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎడిబుల్‌ ఆయిల్స్‌, బంగారం, వెండి దిగుమతి ధరలను ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయిల్‌ దిగుమతి సుంకాలను పెంచడంతో ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రపంచంలోని అధిక మొత్తంలో ఆయిల్‌ను భారత్‌ రష్యా, ఉక్రెయిన్‌, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి సరఫరా చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తతల కోసం ఇక్కడ క్లిక్ చేయండి