Fuel Price Hike: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ధరలకు బ్రేకులు పడ్డాయి. ఎందుకంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ రాబోయే రోజుల్లో విపరీంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు(crud oil) ధరలే ఇందుకు కారణం. ఇప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు అయిల్ కంపెనీలు రెడీగా ఉన్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ధరల పెంపును వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచే అవకాశం ఉందని డెలాయిట్ నివేదిక పేర్కొంది. మార్చి నెలలో పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
మార్చి 10వ తేదీ నాటికి విక్రయ ధరలలో ఎంత లోటు భరించాయో.. ఆ మొత్తాన్ని వసూల చేసుకునేందుకు ధరలను పెంచన్నట్లు తెలుస్తోంది. లీటర్‌పై దాదాపు రూ.8 నుంచి రూ.9 వరకు పెరిగే అవకాశం ఉందని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా తెలిపారు. అయితే ధరలు అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ భారత్ ఆయిల్ కంపెనీలు ధరలను పెంచలేదని డెలాయిట్ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయి.
పెరిగిన మొత్తంలో కొంత మొత్తం కేంద్రం భరిస్తుందా..?
మార్చి తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినా.. అందులో కొంత మొత్తం కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని భరిస్తుందని డెలాయిట్ చెబుతోంది. ధరలు పెరుగుదల అనేది కేంద్రానికి, సెంట్రల్ బ్యాంకుకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని తెలిపింది. ఇంధన ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల ఇండియా ఆర్థిక వృద్ధిని 0.3 శాతం నుంచి 0.35 శాతంకు దెబ్బ తీస్తుందని నివేదికలు వెల్లడవుతున్నాయి.
ఇవి కూడా చదవండి: