Independence Day: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.25కే పోస్టాఫీసుల్లో జాతీయ జెండా.. ఎలా కొనుగోలు చేయాలంటే..

|

Aug 06, 2023 | 5:50 PM

ఆల్-ఇండియా రేడియో న్యూస్ అధికారిక ట్వీట్ ప్రకారం.. ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. పౌరులు జాతీయ జెండాను డిపార్ట్‌మెంట్ ఇ-పోస్టాఫీసు సౌకర్యం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి ఇంటి త్రివర్ణ ప్రచారం 13 ఆగస్టు నుంచి 15 ఆగస్టు 2023 వరకు కొనసాగుతుంది..

Independence Day: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.25కే పోస్టాఫీసుల్లో జాతీయ జెండా.. ఎలా కొనుగోలు చేయాలంటే..
Post Office
Follow us on

భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అలాగే ఇప్పుడు భారతదేశం తన 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. కాగా, హర్ ఘర్ తిరంగా ప్రచారం 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో భారత జాతీయ జెండాను విక్రయిస్తున్నారు. పౌరులందరూ తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. తపాలా శాఖ తన వెబ్ పోర్టల్ ద్వారా జాతీయ జెండాను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు ప్రకటించింది.

ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం

ఆల్-ఇండియా రేడియో న్యూస్ అధికారిక ట్వీట్ ప్రకారం.. ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు 1.60 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. పౌరులు జాతీయ జెండాను డిపార్ట్‌మెంట్ ఇ-పోస్టాఫీసు సౌకర్యం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రతి ఇంటి త్రివర్ణ ప్రచారం 13 ఆగస్టు నుంచి 15 ఆగస్టు 2023 వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇండియా పోస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో జెండాను ఎలా కొనుగోలు చేయాలి?

  • ముందుగా పోస్టాఫీసు వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • హర్‌ గర్‌ తిరంగ పై క్లిక్‌ చేయండి
  • – అక్కడ లాగిన్‌ అవ్వండి
  • – ప్రోడక్ట్‌లు కింద ‘జాతీయ పతాకం’పై క్లిక్ చేయండి
  • అక్కడ కొనుగోలుపై క్లిక్‌ చేసి మొబైల్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయండి. అలాగే మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి
  • ప్రొసీడ్ ఫర్ పేమెంట్’ ఎంపికపై క్లిక్ చేయండి
  • కావలసిన చెల్లింపు విధానాన్ని ఉపయోగించి రూ. 25 చెల్లించండి

త్రివర్ణ పతాకాన్ని ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని కోసం, మీరు త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయడానికి సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లవచ్చు. మీరు జాతీయ జెండాను రూ.25 నామమాత్రపు ధరతో సమీపంలోని పోస్టాఫీసు నుంచి లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

 


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి