ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య దేశీయ విమాన(Flight) ప్రయాణికుల సంఖ్య 69.79% పెరిగింది. ఈ నాలుగు నెలల్లో దేశీయ విమానాల్లో మొత్తం 3.57 కోట్ల మంది ప్రయాణికులు(passengers) ప్రయాణించారు. ఒక్క ఏప్రిల్‌లోనే 1.09 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది ఏప్రిల్‌లో 57.25 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి అందిన సమాచారం ప్రకారం గతేడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో కేవలం 2.92 కోట్ల మంది మాత్రమే ప్రయాణించారు. ఈ నెల 21వ తేదీ వరకు 77,19,693 మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. ఏప్రిల్ 2022లో, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లోని విమానాశ్రయాలలో సమయానుకూల పనితీరులో AirAsia అగ్రగామిగా ఉంది. దాని సమయ పనితీరు 94.8శాతంగా ఉంది.
అదేవిధంగా విస్తారా 90.9 శాతం, ఇండిగో 90.1 శాతం, స్పైస్ జెట్ 89.2 శాతం, గో ఫస్ట్ 87.2 శాతం, ఎయిర్ ఇండియా 81.8 శాతం, అలయన్స్ ఎయిర్ 63% కలిగి ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 2022 మొదటి మూడు నెలల్లో 13.6 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. గత ఏడాది కంటే రెండింతలు ఎక్కువ. ఈ సంవత్సరం ప్రయాణికుల ట్రాఫిక్ ఇప్పటివరకు దుబాయ్ – భారతదేశం, దుబాయి- పాకిస్తాన్ ఎక్కువ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…