IT Returns: మరణించిన వ్యక్తికి కూడా ఆదాయపు పన్ను విధించవచ్చు. ఏమిటీ ఆశ్చర్య పోతున్నారా? మరి ఆదాయపు పన్ను నియమం అలాంటిది. ఒకవేళ ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఆదాయానికి పన్ను విధించి ఉంటే, అతని మరణం తర్వాత కూడా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాలి. రిటర్న్ దాఖలు చేసే బాధ్యత మరణించిన వ్యక్తి వారసుడు లేదా వారసురాలిపై ఉంటుంది. మరణించిన తేదీ వరకు ఆ వ్యక్తి సంపాదించిన ఆదాయం, అతని ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలి.
దీనికి కొన్ని ప్రత్యేక.. ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. మరణించిన వ్యక్తి చట్టపరమైన వారసుడు లేదా వారసురాలు ఆదాయపు పన్ను వెబ్సైట్లో తనను తాను నమోదు చేసుకోవాలి. మరణించిన వ్యక్తి తరపున చట్టపరమైన వారసుడిగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్నట్లు పేర్కొనాలి. ఇక్కడ చట్టపరమైన వారసుడు లేదా వారసురాలు అంటే మరణించిన వ్యక్తి తన జీవితంలో చట్టబద్ధంగా తన ఆస్తి యజమానిగా ప్రకటించిన వ్యక్తి. కొన్నిసార్లు నామినీ.. చట్టపరమైన వారసుడికి సంబంధించి అభిప్రాయ భేదాలు ఉంటాయి. చట్టం దృష్టిలో చట్టపరమైన వారసుడు కాదా అని నిరూపించే కొన్ని పత్రాలు ఉన్నాయి.
కోర్టు జారీ చేసే చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్, స్థానిక రెవెన్యూ అథారిటీ నుండి వచ్చిన చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్, బతికున్న కుటుంబ సభ్యుల పేరిట స్థానిక రెవెన్యూ కార్యాలయం జారీ చేసిన సర్టిఫికేట్, మరణించిన వ్యక్తి వారసుడి పేరును వీలునామాలో రాసినా లేదా కుటుంబ పెన్షన్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినట్లయితే, ఆ వ్యక్తి తన వారసత్వాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
వారసుడిగా నమోదు చేసుకోండి ఇలా..
ఈ పత్రాలు అవసరం..
రిటర్న్స్‌ని ఎలా ఫైల్ చేయాలి
Also Read: Railway: ఆ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్ చాలా ఖరీదు..! ఎందుకో తెలుసా..?
Hugging: కౌగిలించుకోవడం వల్ల ఈ 4 ఆరోగ్య ప్రయోజనాలు..! మీకు తెలియకుండానే జరిగిపోతాయి..