IMPS Money Transfer Rules: ఐఎంపీఎస్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు నో రూల్..

|

Oct 18, 2023 | 12:09 PM

ఐఎంపీఎస్ రూల్స్ మారిపోయాయి. ఇప్పటివరకూ పెద్ద మొత్తంలో ఐఎంపీఎస్‌ ద్వారా నగదు పంపించాలంటే బెనిఫీషియరీని బ్యాంక్‌ ఖాతాకు మనం యాడ్‌ చేసుకోవాలనే రూల్ ఉండేది. వారి మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ పేరు, నగదు స్వీకరించేవారి పేరు ఉంటే చాలు. నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 5లక్షల వరకు నగదు పంపవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ) తెలిపింది. ఆ పూర్తి వివరాలను ఇక్కడ మనం తెలుసుకుందాం..

IMPS Money Transfer Rules: ఐఎంపీఎస్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు నో రూల్..
Imps Money Transfer
Follow us on

మీరు ఐఎంపీఎస్ (తక్షణ చెల్లింపు సేవ) వినియోగదారు అయితే.. ఈ వార్త మీకోసమే. ఇప్పుడు ఐఎంపీఎస్ సేవలు మరింత ఈజీగా మారుతున్నాయి. ఇప్పుడు ఆ అవసరం లేదు.. వేలల్లో కాదు లక్షల్లో కూడా ఇలా ఫింగర్ టిప్‌తో పంపించవచ్చు. తాజాగా ఐఎంపీఎస్ రూల్స్ మారిపోయాయి. ఇప్పటివరకూ పెద్ద మొత్తంలో ఐఎంపీఎస్‌ ద్వారా నగదు పంపించాలంటే బెనిఫీషియరీని బ్యాంక్‌ ఖాతాకు మనం యాడ్‌ చేసుకోవాలనే రూల్ ఉండేది. వారి మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ పేరు, నగదు స్వీకరించేవారి పేరు ఉంటే చాలు. నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 5లక్షల వరకు నగదు పంపవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ) తెలిపింది.

లబ్ధిదారుని యాడ్ చేయని వ్యక్తు రూ. 5 లక్షల వరకు ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేయవచ్చు. ఎన్‌పీసీఏ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చెల్లింపు బదిలీని సులభతరం చేసింది. ఈ కొత్త మార్పు తర్వాత.. మీరు లబ్ధిదారుని మొబైల్ నంబర్, అతని బ్యాంక్ ఖాతాలో నమోదు చేయబడిన పేరు ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సర్వీసు ప్రారంభం కాలేదు.

ఇప్పుడు నియమాలు ఏంటంటే..

ప్రస్తుత నిబంధన ప్రకారం ఐఎంపీఎస్ ద్వారా పెద్ద మొత్తంలో పంపాలంటే లబ్ధిదారుని పేరు, బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను నమోదు చేయాలి.. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. లబ్ధిదారుల వివరాలను జోడించే వరకు నిధులు బదిలీ చేయబడవు. అయితే కొత్త నిబంధనల అమలు తర్వాత ఇంత సుదీర్ఘ ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉండదు. రూ. 5 లక్షల వరకు చెల్లింపు మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాలో నమోదు చేయబడిన పేరు ద్వారా మాత్రమే బదిలీ చేయబడుతుంది.

కార్పొరేట్‌కు విస్తరించవచ్చు..

ఎన్‌పీసీఏ ప్రకారం, ఈ కొత్త వ్యవస్థను హోల్‌సేల్, రిటైల్ లావాదేవీలతో పాటు కార్పొరేట్‌కు కూడా విస్తరించవచ్చు. ఇప్పుడు వారి పాలసీలను బట్టి ఎగువ పరిమితి బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతుంది. కొత్త సదుపాయంలో.. లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో ఉపయోగించిన పేరు ఆధారంగా ధృవీకరణ జరుగుతుంది. కొత్త సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత.. బ్యాంకు ఖాతాలో నమోదు చేయబడిన మొబైల్ నంబర్, పేరు వివరాలను నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేేయండి