Personal Loan: మీరు వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి!

|

May 31, 2023 | 9:00 AM

ఇప్పుడు వివిధ సందర్భాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. కొందరు ఇళ్లు కొనేందుకు, మరికొందరు కార్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా డబ్బును బ్యాంకుకు తిరిగి..

Personal Loan: మీరు వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి!
Personal Loan
Follow us on

ఇప్పుడు వివిధ సందర్భాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. కొందరు ఇళ్లు కొనేందుకు, మరికొందరు కార్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా డబ్బును బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సమయానికి లోన్‌ డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

చాలా మంది వ్యక్తిగత అవసరాలు, వివాహం లేదా కుటుంబ కారణాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. చాలా మంది బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకుని ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారు. అలాంటి పని చేయడం ఖచ్చితంగా తెలివైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పర్సనల్‌ లోన్ తో స్టాక్ మార్కెట్ లాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆర్థిక సలహాదారుల ప్రకారం.. వ్యక్తిగత రుణం తీసుకోవడానికి ఎటువంటి హామీ అవసరం లేదు కాబట్టి, ఈ లోన్‌లపై అత్యధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇతర వాటిలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన తర్వాత ఒక వేళ నష్టపోయినట్లయితే వడ్డీతో పాటు మరింతగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. ఎవరైనా బ్యాంక్ నుండి వ్యక్తిగత రుణంతో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనవసరంగా పర్సనల్ లోన్ తీసుకోవలసిన అవసరం లేదు. చాలా మంది కస్టమర్‌లకు ముందుగా ఆమోదించబడిన వ్యక్తిగత రుణాలను అందిస్తాయి బ్యాంకులు. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు సిబిల్‌ స్కోర్ ఆధారంగా ఈ రుణాలను అందిస్తాయి. మీరు సులభంగా 10 నుండి 15 లక్షల రూపాయల రుణాన్ని పొందవచ్చు.

రుణం లభ్యత కారణంగా అనవసరమైన రుణాలతో ఆర్థిక భారాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఈ సందర్భంలో డబ్బును నిర్దిష్ట వ్యవధిలో వడ్డీతో సహా బ్యాంకుకు తిరిగి ఇవ్వాలి. స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలు రావచ్చు.. లేదా నష్టాలు కూడా రావచ్చు. ఇందులో ఇన్వెస్ట్‌ చేసి ఎంతో మంది నష్టపోయిన వారున్నారు. కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేసేందుకు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణం పొందడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి