iMobile Pay App: మీ ఫోన్‌లో ఒక్క యాప్‌ ఉంటే చాలు.. ఏ బ్యాంకు క్రెడిట్‌ బిల్లు అయినా చెల్లింవచ్చు!

|

Dec 15, 2021 | 4:18 PM

iMobile Pay App: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? అయితే మీకు ఒక తీపికబురు అందింది. దేశీ ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు ఇటీవల..

iMobile Pay App: మీ ఫోన్‌లో ఒక్క యాప్‌ ఉంటే చాలు.. ఏ బ్యాంకు క్రెడిట్‌ బిల్లు అయినా చెల్లింవచ్చు!
Follow us on

iMobile Pay App: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? అయితే మీకు ఒక తీపికబురు అందింది. దేశీ ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు ఇటీవల తన వినియోగదారులకు శుభవార్త అందించింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులను మరింత సులభతరం చేసింది. దీంతో చాలా మందికి మేలు జరగనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐమొబైల్ పే యాప్ ద్వారా మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా కస్టమర్లు ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించవచ్చు. మల్టీపుల్ క్రెడిట్ కార్డులు వాడే వారికి దీని వల్ల ఉపయోగం ఉండనుంది. అన్ని కార్డుల బిల్లులను ఒకేచోట చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఐమొబైల్ పే యాప్ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలని భావించే వారు ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉచితంగానే అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత యాప్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత కార్డ్స్ అండ్ ఫారెక్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో అదర్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత యాడ్ కార్డు‌పై క్లిక్ చేయాలి. మీ కార్డు వివరాలు ఎంటర్ చేసి కార్డును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ కార్డు వివరాలను అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ట్యాబ్ కింద చూసుకుని బిల్లు చెల్లించవచ్చు.

ఇవి  కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు ఆదాయం..!

BMW Electric Car: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనం.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర, ఇతర వివరాలు