Ultraviolette F77 Bike: నెలకు రూ.8700 కడితే ఆ స్టైలిష్‌ ఈవీ బైక్‌ మీ సొంతం.. ఈఎంఐ లెక్క ఏంటంటే?

|

Dec 16, 2024 | 9:00 AM

ఇటీవల కాలంలో యువత ఎక్కువగా బైక్స్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తూ రైడింగ్‌ అనుభూతిని పొందుతున్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని స్పోర్ట్స్‌ బైక్స్‌ నయా ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. అయితే అల్ట్రావైలేట్‌ ఎఫ్‌-77 ఈవీ బైక్‌ యువతను అమితంగా ఆకర్షిస్తుంది. అతి తక్కువ డౌన్‌ పేమెంట్‌తో ఈ సూపర్‌ ఈవీ బైక్‌ మీ సొంతం చేసుకునే ప్లాన్‌ గురించి తెలుసుకుందాం.

Ultraviolette F77 Bike: నెలకు రూ.8700 కడితే  ఆ స్టైలిష్‌ ఈవీ బైక్‌ మీ సొంతం.. ఈఎంఐ లెక్క ఏంటంటే?
Ultraviolette F77
Follow us on

స్పోర్ట్స్ బైక్స్‌ లవర్స్‌ను కూల్ లుక్‌తో అల్ట్రావైలెట్ ఎఫ్‌-77 ఎలక్ట్రిక్ బైక్ ఆకర్షిస్తుంది. ఈ బైక్‌ 10.3 కేడబ్ల్యూహెచ్‌ పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న మార్కెట్‌లోని అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌గా రికార్డును సృష్టించింది. అలాగే ఈ ఈవీ బైక్‌  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఈ బైక్‌పై చాలా చౌకైన ఫైనాన్స్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. అల్ట్రావైలెట్ ఎఫ్‌-77 30 కేడబ్ల్యూకు సంబంధించిన పర్మినెంట్‌ మాగ్నెట్ ఏసీ మోటారుతో వస్తుంది. అందువల్ల ఈ బైక్‌ 100 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీపై కంపెనీ 8 సంవత్సరాలు లేదా 8 లక్షల కిలోమీటర్ల వారంటీని ఇస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 330 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. 

అల్ట్రావైలెట్ ఎఫ్‌-77 బైక్‌ గరిష్ట వేగం గంటకు 155 కి.మీగా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ బైక్ కేవలం 7.7 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుందని వివరిస్తున్నారు. అల్ట్రావైలెట్ ఎఫ్‌-77 కూల్ ఎలక్ట్రిక్ బైక్‌లో ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ క్లాక్, స్విచ్ చేసేలా ఏబీఎస్‌, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, మల్టీ- ఫంక్షన్ 5 ఇంచెస్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, పార్క్ అసిస్ట్, థొరెటల్ కంట్రోల్, ఫైండ్ మై వెహికల్, జీపీఎస్‌, డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, మొబైల్ అప్లికేషన్, కాల్, ఎస్‌ఎంఎస్‌ అలెర్ట్స్‌ వంటి అధునాతన ఫీచర్లనీ ఈ బైక్‌లో ఉన్నాయి. 

అల్ట్రావైలెట్ ఎఫ్‌-77 ఎలక్ట్రిక్ బైక్ ముందు వైపున 41 ఎంఎం ప్రీలోడ్ అడ్జస్టబుల్ అప్‌సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌తో వస్తుంది. అలాగే బ్యాక్‌ సైడ్‌ ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ బైక్‌ బ్రేకింగ్ సిస్టమ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. అల్ట్రావైలెట్ ఎఫ్‌-77 ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ధర రూ.2.99 లక్షల నుంచి రూ.3.99 లక్షల వరకు ఉంది. అదే ఫైనాన్స్ ప్లాన్ ద్వారా మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం రూ. 32,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అనంతరం 6 శాతం వడ్డీ రేటుతో 3 సంవత్సరాల ఈఎంఐ ప్లాన్‌ ద్వారా రూ. 2,85,186 రుణాన్ని పొందవచ్చు. ఈ రుణానికి సంబంధించి మీరు ప్రతి నెలా రూ. 8,676 ఈఎంఐ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి