EPFO Investment: ఆ పథకంలో పెట్టుబడి పెడితే కోటీశ్వరుడు అవ్వడం గ్యారెంటీ.. రిటైర్మెంట్‌ ప్లాన్‌తోనే సాధ్యం

| Edited By: Ravi Kiran

Nov 07, 2023 | 8:38 PM

పీపీఎఫ్‌ పథకంలో పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరులిగా మారుస్తుంది. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పీపీఎఫ్‌లో ఏటా గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి నెలా కనీసం రూ.12,500 పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తుంది.

EPFO Investment: ఆ పథకంలో పెట్టుబడి పెడితే కోటీశ్వరుడు అవ్వడం గ్యారెంటీ.. రిటైర్మెంట్‌ ప్లాన్‌తోనే సాధ్యం
Ppf
Follow us on

కోటీశ్వరుడు కావడం మధ్యతరగతి వారికి ఓ కల లాంటిది. మీరు ఈ కలను నెరవేర్చుకోవాలనుకుంటే పెట్టుబడి పెట్టడం అనేది ఉత్తమ మార్గం. దీర్ఘకాలిక పెట్టుబడి మిమ్మల్ని సులభంగా కోటీశ్వరుడిగా మారుస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. మీరు ఉద్యోగం చేస్తుంటే వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత మంచి రాబడులు వస్తాయి. 25 ఏళ్లలో మిమ్మల్ని గ్యారెంటీ కోటీశ్వరునిగా మార్చగల అటువంటి ప్రభుత్వ పథకం గురించి ఓ సారి తెలుసుకుందాం. పీపీఎఫ్‌ పథకంలో పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరులిగా మారుస్తుంది. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పీపీఎఫ్‌లో ఏటా గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి నెలా కనీసం రూ.12,500 పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తుంది. కాబట్టి పీపీఎఫ్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం

ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ ఇస్తుంది. మీరు 30 సంవత్సరాల వయస్సులో కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీరు 55 సంవత్సరాల వయస్సులో కోటీశ్వరులుగా మారవచ్చు. పీపీఎఫ్‌లో డిపాజిట్ చేసిన డబ్బు, అందుకున్న వడ్డీ, మెచ్యూరిటీపై పొందే మొత్తం పూర్తిగా పన్ను రహితంగా వస్తుంది. అంటే ఈ పథకంలో పెట్టుబడి ఈఈఈ వర్గంలో ఉంచుతారు.

కోటీశ్వరుడు అవ్వడం ఇలా

పీపీఎఫ్‌ పథకం 15 సంవత్సరాలు అయినప్పటికీ వాటిని 5 సంవత్సరాల బ్లాక్‌లలో పొడిగించవచ్చు. మీరు ఏటా రూ. 1.5 లక్షలను పీపీఎఫ్‌లో డిపాజిట్ చేస్తే 25 ఏళ్లపాటు నిరంతరం డిపాజిట్ చేయండి. దీని కోసం మీరు రెండుసార్లు పీపీఎఫ్‌ పొడిగింపును పొందాల్సి ఉంటుంది. పీపీఎఫ్‌ కాలిక్యులేటర్ ప్రకారం మీరు 25 సంవత్సరాలలో రూ.37,50,000 పెట్టుబడి పెడతారు. మీకు వడ్డీగా రూ.65,58,015 లభిస్తుంది. ఈ విధంగా 25 సంవత్సరాల తర్వాత, మీరు మొత్తం రూ.1,03,08,015 పొందుతారు. మీ జీతం రూ.65-70 వేలు అయితే 1.5 లక్షల వార్షిక పెట్టుబడి పెద్ద విషయం కాదు. ప్రతి వ్యక్తి  తన ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి