ATM Currency: ఏటీఎం నుంచి చిరిగిన, చెల్లని నోట్లు వచ్చాయా..? ఇలా చేసి మంచి నోట్లు తీసుకోండి..!

ATM Currency: అకౌంట్‌ నుంచి డబ్బులు కావాలంటే ముందుగా ఏటీఎంకు వెళ్తుంటాము. బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం కరోనా కాలంలో..

ATM Currency: ఏటీఎం నుంచి చిరిగిన, చెల్లని నోట్లు వచ్చాయా..? ఇలా చేసి మంచి నోట్లు తీసుకోండి..!
Torn Currency

Updated on: Jun 13, 2021 | 1:38 PM

ATM Currency: అకౌంట్‌ నుంచి డబ్బులు కావాలంటే ముందుగా ఏటీఎంకు వెళ్తుంటాము. బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం కరోనా కాలంలో బ్యాంకుకు వెళ్లే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇక అవసరాలకు అనుగుణంగా ఏటీఎంలకు వెళ్లి డబ్బులను డ్రా చేసుకుంటాము. అయితే కొన్ని సార్లు ఏటీఎంల నుంచి కూడా నోట్లు చిరిగిపోయినవి కూడా వస్తుంటాయి. అలాంటి సమయంలో చాలా మంది టెన్షన్‌కు గురవుతుంటారు. ఎందుకంటే వాటిని ఎవ్వరు కూడా తీసుకోరని. ఇక ఏటీఎంల నుంచి వచ్చిన డబ్బులును ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటాము. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. ఏటీఎంల నుంచి చిరిగినా లేదా మురికిగా మారిన చెల్లని పరిస్థితి ఉంటే డబ్బులను మార్పిడి చేసుకోవడం ద్వారా మంచి నోట్లను తిరిగి పొందవచ్చు. ఈ కరెన్సీని మార్చుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.

ప్రతి బ్యాంకు శాఖలు ఇలాంటి నోట్లను తిరస్కరించకుండా మార్పిడి చేయాలని 2017 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉత్తర్వులు జారీ చేసింది. నోట్లు మార్పిడి చేయడానికి ఒక బ్యాంకు ఎక్కువ సమయం తీసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నిబంధనలు పాటించని బ్యాంకులు రూ .10,000 వరకు జరిమానా సైతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే ఏటీఎంల నుంచి చిరిగిపోయినా , పాడైపోయిన నోట్లు వచ్చినట్లయితే వెంటనే, ఆ ఏటీఎం ఏ బ్యాంకుకు సంబంధించినదో తెలుసుకుని వెంటనే ఆ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఎంత డబ్బు ఉపసంహరించుకున్నారన్న విషయాన్ని దరఖాస్తులో తెలుపాల్సి ఉంటుంది. విత్ డ్రా స్లిప్‌ కూడా దరఖాస్తుకు జత చేయాలి. ఒక వేళ మీ వద్ద రశీదు లేకపోతే లావాదేవీ యొక్క ఎస్‌ఎంఎస్‌ (SMS) ను చూపించాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన తరువాత సదరు బ్యాంకు మీకు ఆ చిరిగిన లేదా చెల్లని నోటు స్థానంలో కొత్త కరెన్సీ నోటును జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ కొద్ది సేపట్లోనే పూర్తి అవుతుంది.

Insurance Policy: టీకా తీసుకుంటేనే పాలసీ ఇస్తారా?.. కొత్త నిబంధనలు తీసుకువస్తున్న బీమా కంపెనీలు

ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!

Loading...
Unable to load recommendations.
Follow Us