పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…

|

Apr 22, 2021 | 10:25 AM

Post Office: నెలవారీ జీతం క్షణాల్లోనే ఖర్చు చేసేస్తున్నారా ? డబ్బు పొదుపు చేయాలని భావిస్తున్నారా ? అయితే మీరు

పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు...
Post Office
Follow us on

Post Office: నెలవారీ జీతం క్షణాల్లోనే ఖర్చు చేసేస్తున్నారా ? డబ్బు పొదుపు చేయాలని భావిస్తున్నారా ? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. డబ్బు పొదుపు చేయాలనుకునేవారికి పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రామ్ సంతోష్ (Gram Santhosh Scheme) ఇన్సూరెన్స్ స్కీమ్. మీరు ఈ పాలసీ తీసుకోవడం వలన రూ.22తో ఏకంగా రూ.8లక్షలు పొందవచ్చు. గ్రామ్ సంతోష్ అనేది ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్. 19 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. 55 ఏళ్లలోపు వారు ఈ పాలసీ పొందొచ్చు. కనీసం రూ. 10 వేల భీమా మొత్తానికి ఈ పాలసీని తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.10 లక్షల భీమా మొత్తానికి పాలసీ పొందవచ్చు. పాలసీ టర్మ్ 35, 40, 45, 50, 58, 60 ఏళ్లుగా ఉంటుంది. (Post Office Gram Santhosh Scheme)

Insurance Schemes  అంటే మీకు 25 ఏళ్లు ఉన్నాయనుకుంటే.. రూ.3 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారనుకుందాం. మెచ్యూరిటీ కాలంలో 35 ఏళ్లకు రూ.4.44 లక్షలు, 40 ఏళ్లకు రూ.5.16 లక్షలు, 45 ఏళ్లకు రూ.5.88 లక్షలు, 50 ఏళ్లకు రూ.6.6 లక్షలు, 55 ఏళ్లకు రూ.7.3 లక్షలు, 58 ఏళ్లకు రూ.7.7 లక్షలు, 60 ఏళ్ళకు రూ.8.04 లక్షలు పొందవచ్చు. అలాగే నెలవారీ ప్రీమియంలో 35 ఏళ్లక రూ.3518, 40 ఏళ్లకు రూ.1693, 45 ఏళ్లకు రూ.1223, 50 ఏళ్లకు టర్మ్ రూ.956, 55 ఏళ్ల టర్మ్ రూ. 768, 58 ఏళ్లకు రూ.690, 60 ఏళ్లకు రూ.643. ఒక వేళ మీరు 25 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే 60 ఏళ్ల రిటైర్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే 35 ఏళ్ళు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.643 కట్టాల్సి ఉంటుంది. రోజుకు రూ.22 ఆదా చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.8.4 లక్షలు పొందోచ్చు అన్నమాట.

Also Read: SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..