NFO: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌ ఫండ్‌.. 11 వరకు అవకాశం..

|

Oct 03, 2021 | 6:22 PM

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మరో కొత్త అంతర్జాతీయ పథకాన్ని తీసుకొచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 11...

NFO: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌ ఫండ్‌.. 11 వరకు అవకాశం..
Mutual Fund
Follow us on

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మరో కొత్త అంతర్జాతీయ పథకాన్ని తీసుకొచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం NFO (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 11. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకంలో కనీస పెట్టుబడి రూ.1,000గా ఉంది. ఈ పథకం కింద మదుపరుల నుంచి సమీకరించిన నిధులను నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌లో భాగంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలపై పెట్టుబడిగా పెడతారు. తద్వారా భారతీయ మదుపరులకు ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తున్నట్లు అవుతోంది. అంతేగాక డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం అయినప్పుడు ‘హెడ్జింగ్‌’ ప్రయోజనం మదుపరులకు లభిస్తుంది.

నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌లో యాపిల్‌కు అధిక వెయిటేజీ (11.35%) ఉంది. తదుపరి స్థానాల్లో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఆల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌, టెస్లా, ఎన్విడియా, పేపాల్‌, ఆడోబ్‌ ఉన్నాయి. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌ ఫండ్‌’ లో పెట్టుబడి పెడితే తమ పెట్టుబడిని మదుపరులు కేవలం మనదేశానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు కొంత పెట్టుబడిని కేటాయించినట్లు అవుతుంది. గత రెండు దశాబ్దాల్లో నాస్‌డాక్‌- 100 ఇండెక్స్‌ నాలుగు రెట్లు పెరిగింది. అంతేగాక బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీతో పోల్చినప్పుడు నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌ పయనం కొంత సానుకూలంగా ఉంటోంది.

 

Read Also..  Automobile: ఆటోమొబైల్‌ రంగంపై చిప్స్ దెబ్బ.. భారీగా తగ్గిన అమ్మకాలు.. తైవాన్‌తో ఒప్పందం దిశగా భారత్..