Penalty on Banks: ఐసీఐసీఐ..పంజాబ్ నేషనల్ బ్యాంకులకు భారీ జరిమానా విధించిన రిజర్వ్ బ్యాంక్.. ఎందుకంటే..

|

Dec 15, 2021 | 9:23 PM

రెండు పెద్ద బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ భారీ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)పై ఆర్బీఐ బుధవారం భారీ జరిమానా విధించింది.

Penalty on Banks: ఐసీఐసీఐ..పంజాబ్ నేషనల్ బ్యాంకులకు భారీ జరిమానా విధించిన రిజర్వ్ బ్యాంక్.. ఎందుకంటే..
Rbi Penality On Icici And Pnb
Follow us on

Penalty on Banks: రెండు పెద్ద బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ భారీ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)పై ఆర్బీఐ బుధవారం భారీ జరిమానా విధించింది. ఆర్‌బీఐ.. ఐసీఐసీఐ బ్యాంకుపై రూ.30 లక్షలు, పీఎన్‌బీపై రూ.1.80 కోట్లు జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు రెండు బ్యాంకులపైనా ఈ చర్య తీసుకున్నారు. ఈ చర్యకు సంబంధించి, ఆర్బీఐ(RBI) కొన్ని సూచనలను పాటించనందున ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. పొదుపు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఆర్బీఐ కొన్ని సూచనలు ఇచ్చింది. పాటించడంలో అలసత్వం కారణంగా ఈ చర్య తీసుకున్నారు.

ఆర్బీఐ ఏం చెప్పింది?

మార్చి 31, 2019న, సూపర్‌వైజరీ మూల్యాంకనం కింద రిజర్వ్ బ్యాంక్ ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్ తనిఖీని నిర్వహించిందని ఆర్బీఐ(RBI) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తనిఖీలో బ్యాంకు ఆర్థిక పరిస్థితి కనిపించింది. రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్, ఇన్‌స్పెక్షన్ రిపోర్టును కూడా ఆర్బీఐ పరిశీలించింది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన కొన్ని సూచనలు పాటించలేదని తేలింది. పొదుపు ఖాతాలో కనీస డిపాజిట్ మొత్తాన్ని నిర్వహించనందుకు పెనాల్టీవిధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని పరీక్షల అనంతరం బ్యాంకుపై చర్యలు తీసుకున్నారు.

నిబంధనలలో అలసత్వం వహించినందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిందని, సూచనలను పాటించని పక్షంలో దానిపై ఎందుకు జరిమానా విధించకూడదో బ్యాంక్ వివరించాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది. బ్యాంక్ నుండి సమాధానం వచ్చిన తర్వాత, ఆ బ్యాంక్ పై ఆర్థిక జరిమానా విధించాలని నిర్ణయించారు.

PNBపై ఎందుకు చర్య తీసుకున్నారు?

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. పీఎన్బీ(PNB)పై ఆర్బీఐ రూ.1.80 కోట్ల ద్రవ్య పెనాల్టీ విధించింది. ఐఎస్ఈ(ISE), ఇతర పత్రాలను పరిశీలించిన తర్వాత, ఆర్బీఐ..పీఎన్బీ(PNB) షేర్ల తాకట్టుకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో పీఎన్‌బీపై చర్యలు తీసుకున్నారు.

రెండు బ్యాంకుల విషయంలోనూ బ్యాంకుకు సంబంధించిన రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడం గమనార్హం. దీని ప్రకారం రెండు బ్యాంకులపై చర్యలు తీసుకున్నారు. అయితే, ఈ చర్య బ్యాంకుల పనితీరు, కస్టమర్‌లతో ఒప్పందాలు లేదా ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుపై ప్రభావం చూపదు. ఈ మేరకు ఆర్బీఐ సమాచారం ఇచ్చింది.