Oppo Foldable Smartphone: ఒప్పో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇతర వివరాలు
Oppo Foldable Smartphone: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో..
Oppo Foldable Smartphone: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అడుగు పెట్టింది. ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదల చేసింది. అయితే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో పేరుగాంచిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లకు తక్కువ ధరల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఒప్పో. కంపెనీ నిర్వహించిన ఇన్నో 2021 కార్యక్రమంలో రెండో రోజు ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఓప్పో నుంచి ఇప్పటికే రకరకాల మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుండగా, తాజాగా ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. శాంసంగ్‌కు పోటీగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
అయితే ఈ ఫోన్ ముందుగా చైనా మార్కెట్లోకి విడుదల చేయగా, త్వరలో భారల్‌లో కూడా విడుదల కానుంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఒప్పో ప్రయత్నాలు చేస్తోంది. దీని ధర రూ.92,000 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఇక ఫీచర్స్ కూడా అదిరిపోయేలా ఉంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సైజు 7.1 అంగుళాలు కాగా, 5.49 అంగుళాల ఔటర్ డిప్‌ప్లే ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే.. 50+16+13 మెగాపిక్సెల్ రియల్ ట్రిపుల్ కెమెరా ఉంది. అలాగే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పాటు 33వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టు చేయనుంది. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్, డాల్బీ అట్మోఎస్ పోర్టు ఉంది. బ్యాటరీ విషయానికొస్తే.. 4,500ఎంఏహెచ్ ఉంది. అలాగే 10 వాట్స్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది.
ఇవి కూడా చదవండి: