Hyundai: హ్యుందాయ్‌ కీలక నిర్ణయం.. రూ. 25,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా

|

Jun 15, 2024 | 10:28 AM

హ్యుందాయ్‌ తన భారత విభాగానికి సంబంధించి కనీసం రూ. 25,000 కోట్ల సమీకరణ చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఎక్స్ఛేంజీల్లో...

Hyundai: హ్యుందాయ్‌ కీలక నిర్ణయం.. రూ. 25,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా
Hyundai Ipo
Follow us on

దక్షిణ కొరియాకు చెందిన ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తన భారత విభాగాన్ని పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓగా హ్యుందాయ్‌ అవతరించనుంది. ఇదిలా ఉంటే సుమారు రెండు దశాబ్ధాల తర్వాత స్టాక్‌ మార్కెట్లోకి వస్తున్న తొలి వాహన కంపెనీగా హ్యుందాయ్‌ నిలవనుంది. దీనికి సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చాయి.

హ్యుందాయ్‌ తన భారత విభాగానికి సంబంధించి కనీసం రూ. 25,000 కోట్ల సమీకరణ చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఎక్స్ఛేంజీల్లో నమోదైన విషయం తెలిసిందే.

కాగా ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓకు సెబీ నుంచి ఈ వారం మొదట్లో అనుమతులు దక్కాయి. హ్యుందాయ్‌ ఐపీఓకి వెళ్లే ముందు విస్తరణను పెంచే ఉద్దేశంతో ఉంది. 2025 నాటికి హ్యుందాయ్‌ తన వార్షిక ఉత్పత్తిని 10 లక్షల యూనిట్లకు పెంచుంతుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై కంపెనీ దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే హ్యుందాయ్‌ ప్రతిపాదించిన ఐపీఓ కింద హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా(హెచ్‌ఎమ్‌ఐఎల్‌) 15-20 శాతం వాటాను విక్రయించి 3- 5.6 బిలియన్‌ డాలర్ల వరకు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే పత్రాతలను సెబీకి సమర్పించనుందని కంపెనీ చెబుతోంది. ఇదిలా హ్యుందాయ్‌ కంపెనీ ఇండియాలో 1996లో భారత కార్యకలాపాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్లో 13 మోడళ్లను విక్రయిస్తోంది. గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో 7% వృద్ధితో 63,551 వాహనాలను ఇది విక్రయించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..