
ఈ సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్ ఉండే బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ అనే చెప్పాలి. ముఖ్యంగా జనాలు కుప్పలు తెప్పలుగా ఉండే హైదరాబాద్ లాంటి నగరాల్లో చిన్న బంటిపై ఏదో ఒక ఫుడ్ ఐటమ్ అమ్మినా కూడా మంచి లాభం ఉంటుంది. అలాంటిది మంచి రుచి, అంతకు మించి నాణ్యతతో ఒక సూపర్ బిర్యాని అమ్మడం ప్రారంభిస్తే ఇంక ఎలా ఉంటుందో ఊహించుకోండి. బిర్యాని అంటే ప్రాణమించే హైదరాబాదీలు.. సరైన టెస్ట్ తగిలితే క్యూ కట్టేస్తారు.
హైదరాబాదీలకు బిర్యానిపై ఉండే ఈ ఇష్టాన్నే ఇప్పుడు మీ బిజినెస్‌గా మార్చుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో రకాల బిర్యానిలు ఉన్నా.. మీ కంటే ప్రత్యేకమైన బిర్యాని బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగో క్లౌడ్ కిచెన్ సర్వీసులు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఆన్లైన్ డెలివరీలను నమ్ముకొని ఈ క్లౌడ్ కిచెన్ సర్వీస్‌లు నడుస్తున్నాయి. మీరు కూడా తక్కువ పెట్టబడితో ఈ కేవలం బిర్యాని క్లౌడ్ కిచెన్‌ను స్టార్ట్ చేసి.. మంచి టెస్ట్, క్వాలిటీ, క్వాంటిటీతో భోజన ప్రియులను ఆకర్షిస్తే చాలు ఇక మీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుపోతుంది.
ముందుగా తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ ప్రారంభించడం ద్వారా భవిష్యత్తులో చక్కటి రాబడి పొందే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో బిర్యానీకి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు వారిలో చాలా మంది ప్రతిరోజు బిర్యానీ తినడానికి కూడా వెనుకాడరు. మీ బిర్యాని గురించి సోషల్ మీడియా ద్వారా అడ్వర్టైజింగ్ చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో కస్టమర్లను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బిజినెస్ లో అత్యంత ముఖ్యమైనది పబ్లిసిటీ అనే చెప్పాలి. ఇందుకోసం మీరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను వాడుకోవడం తోపాటు, స్వయంగా మీరే సోషల్ మీడియాలో పేజీలను ఓపెన్ చేసి మీ బిర్యాని రుచులను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా చక్కటి ఆర్డర్లను పొందే అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్ లో చిన్న మొత్తంలో ప్రారంభించినట్లయితే నెలకు 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి