Hyderabad: హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇంట్లో ఉండాలంటే నెల ఖర్చెంత..? అసలు లెక్కలివే..

హైదరాబాద్‌లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. కుటుంబసభ్యులు ఎక్కువమంది ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో ఉండాల్సి ఉంటుంది. నగరంలో డబుల్ బెడ్ రూం ఇంట్లో నివసించాలంటే ఖర్చు ఎంత అవుతుందనేది చాలామంది లెక్కులు వేసుకుంటూ ఉంటారు. ఒక సాధారణ ఇంట్లో ఉంటే ఎంత ఖర్చు అవుతుందనేది చూద్దాం.

Hyderabad: హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇంట్లో ఉండాలంటే నెల ఖర్చెంత..? అసలు లెక్కలివే..
Double Bed Room House

Updated on: Oct 16, 2026 | 11:56 AM

విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం లాంటి కారణాలతో ఎక్కువమంది గ్రామాలు, పట్టణాల నుంచి హైదరాబాద్‌కు వస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే అద్దె ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు. నగరంలో మీరు ఎక్కడ చూసినా అద్దె ఇళ్లల్లో నివసించేవారే ఎక్కువమంది కనిపిస్తుంటారు. అందుకే ఏ ఏరియాలో చూసినా టూలెట్ బోర్డులు దర్శనమిస్తుంటాయి. ఏరియాను బట్టి ఇంటి రెంట్ ఉంటుంది. కాస్ట్‌లీ ఏరియాలో అయితే ఎక్కువగా.. మిండ్ రేజ్ ఏరియా, ఔటర్ ఏరియాల్లో అయితే కాస్త తక్కువగా ఉంటుంది. తమ జీతం, నెలవారీ ఖర్చులు, తమ ఆర్ధిక స్తోమతను బట్టి ఏ ఏరియాలో ఉండాలనేది నిర్ణయించుకుటుంటారు. సింగిల్ బెడ్ రూమ్‌ రెంట్ ఒకలా ఉంటే.. ఎక్కువమంది కుటుంబసభ్యులు ఉంటే డబుల్ బెడ్ రూం తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూంలో ఉంటే ప్రతీ నెలా ఎంత ఖర్చు అవుతుందనేది చూద్దాం.

ఈ ఏరియాల్లో డబుల్ బెడ్ రూం ఇంట్లో ఉంటున్నారా..?

ఏదైనా అద్దె ఇంట్లోకి వెళ్లినప్పుడు ముందుగానే ప్రతీ నెలా ఎంత ఖర్చు అవుతుందనేది చాలామంది ముందే అంచనా వేసుకుంటూ ఉంటారు. నగరంలో ఔటర్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఏరియాల్లో ఉంటే డబుల్ బెడ్ రూం అద్దె రూ.12 నుంచి రూ.15 వేలకు లభిస్తుంది. కరెంట్ బిల్లు రూ.వెయ్యి నుంచి రూ.1500, కిరాణా సరుకులు రూ.6 వేలు, వైఫై-టీవీ రూ.వెయ్యి, ప్రయాణ ఖర్చులు రూ.3 వేలు లెక్క వేసుకుంటే రూ.25 వేల వరకు అవుతుంది. నిజాంపేట్, అమీర్ పేట్, కూకట్ పల్లి లాంటి మిండ్ రేంజ్ ఏరియాల్లో ఉంటే ఖర్చు మరోలా ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో మిండ్ రేజ్ ఏరియాల్లో డబుల్ బెడ్ రూం తీసుకుంటే ఇంటి అద్దె రూ.20 వేల వరకు ఉంటుంది. ఇక కరెంట్, వాటర్ బిల్లు సుమారు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఉంటుంది. కిరాణా సరుకులకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అవుతుంది. ఇక వైఫై, టీవీ బిల్లు రూ.వెయ్యి అనుకుందాం. ఇక పెట్రోల్ ఖర్చు రూ.2 నుంచి రూ.3 వేలు అవుతుంది. మొత్తంగా చూసుకుంటే డబుల్ బెడ్ రూంలో ఉండాలంటే రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు అవుతుంది.

ఇంటి బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి..?

అలాగే గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ లాంటి ప్రీమియం ఏరియాల్లో ఉండాలంటే డబుల్ బెడ్ రూం అద్దె రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. ఇక ఇంటి ఖర్చు కలుపుకుంటే రూ.50 వేల వరకు అవుతుంది. ఇక కుటుంబసభ్యుల మొబైల్ రీచార్జ్ ఖర్చులు కలుపుతుంటే మరో రూ.వెయ్యి పెరుగుతుంది. దీంతో మీకు వచ్చే నెలవారీ ఆదాయాన్ని బట్టి ఇంటి బడ్జెట్ ఎంత అవుతుందనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మీ ఇంటి బడ్జెట్ తగ్గుతుంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us