Gold Price Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.! హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?

బంగారం కొనాలనుకుంటున్నారా.? అయితే మీకో షాకింగ్ న్యూస్. తగ్గినట్టే తగ్గి.. వరుసగా పెరుగుతూపోతున్నాయి బంగారం ధరలు. గడిచిన మూడు రోజుల నుంచి సుమారు రూ. 1150 వరకు గోల్డ్ ధర పెరిగింది.ఇక నిన్నటితో పోలిస్తే మరోసారి రూ. 400 వరకు పెరిగి.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58 వేల మార్క్‌కు చేరువైంది ఆ వివరాలు..

Gold Price Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.! హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
Gold price Today ]

Updated on: Oct 09, 2023 | 7:08 AM

బంగారం కొనాలనుకుంటున్నారా.? అయితే మీకో షాకింగ్ న్యూస్. తగ్గినట్టే తగ్గి.. వరుసగా పెరుగుతూపోతున్నాయి బంగారం ధరలు. గడిచిన మూడు రోజుల నుంచి సుమారు రూ. 1150 వరకు గోల్డ్ ధర పెరిగింది.ఇక నిన్నటితో పోలిస్తే మరోసారి రూ. 400 వరకు పెరిగి.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58 వేల మార్క్‌కు చేరువైంది. దీన్ని బట్టి బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో.. అలాగే ఇవాళ హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 53,150కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 440 పెరిగి ప్రస్తుతం రూ 57 540 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ విషయానికొస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,300గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,130గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,580గా ఉంది. ఇక హైదరాబాద్, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,150గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,980గా నమోదైంది.

స్థిరంగా కొనసాగుతోన్న వెండి రేటు..

బంగారం ధరతో పోలిస్తే.. వెండి రేటులో పెద్దగా ఎలాంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 75 వేలకు చేరుకోగా.. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 72,100గా ఉంది. అటు కోల్‌కతా, ముంబైలలో కూడా కిలో వెండి ధర రూ. 72,100గానే ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69 వేలు ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75 వేలకు చేరుకుంది.

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్..

గత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. కీలక వడ్డీరేట్ల విషయంలో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుని.. గతంలోని వడ్డీరేట్లే యధాతధంగా కొనసాగిస్తున్నట్టు చెప్పడంతో సూచీల్లో ఉత్సాహం నింపింది. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు లాభాల బాట పట్టి.. గత వారం అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ వారంతం లాభాల్లో ముగిశాయి. గత శుక్రవారం సెన్సెక్స్ 364.06 పాయింట్లు లాభపడి.. 65,995.63 దగ్గర స్థిరపడింది. అలాగే నిఫ్టీ 107.75 పాయింట్లు లాభపడి 19,653.50 దగ్గర ముగిసింది. ఆలాగే డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 83.23 వద్ద నిలిచింది. మరి చూడాలి.. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో.?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి