Samsung Galaxy S23: ఏకంగా రూ. 13,000 తగ్గింపుతో శామ్సంగ్ గేలాక్సీ ఎస్23.. మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..

గేలాక్సీ ఎస్23 ప్రారంభ ధర 28జీబీ వేరియంట్ రూ. 74,999, 256జీబీ వేరియంట్ ధర రూ. 79,999గా ఉంది. అయితే పరిమిత సేల్ ఆఫర్‌లో భాగంగా మీరు అమెజాన్ లో 128జీబీ ధరతో 256జీబీ వేరియంట్‌ను పొందవచ్చు.

Samsung Galaxy S23:  ఏకంగా రూ. 13,000 తగ్గింపుతో శామ్సంగ్ గేలాక్సీ ఎస్23.. మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..
Samsung Galaxy S23

Updated on: Feb 09, 2023 | 1:36 PM

శామ్సంగ్  తన గేలాక్సీ ఎస్ 23 సిరీస్ ను ఇటీవల గ్లోబల్ వైడ్ గా లాంచ్ చేసింది. గేలాక్సీ ఎస్23 అల్ట్రా, గేలాక్సీ ఎస్23 ప్లస్, గేలాక్సీ ఎస్23 మోడళ్లు ఈ సిరీస్ ఉన్నాయి. అయితే ఇవి ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. ఫిబ్రవరి 23 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ముందస్తు బుకింగ్ కు శామ్సంగ్ అవకాశం కల్పించింది. అంతేకాక పలు ఓపెనింగ్ ఆఫర్లు కూడా ప్రకటించింది. గేలాక్సీ ఎస్23 పై ఏకంగా రూ. 13,000 భారీ తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం..

అమెజాన్ లో ఆఫర్..

గేలాక్సీ ఎస్23 ప్రారంభ ధర 28జీబీ వేరియంట్ రూ. 74,999, 256జీబీ వేరియంట్ రూ. 79,999గా ఉంది. అయితే పరిమిత సేల్ ఆఫర్‌లో భాగంగా మీరు అమెజాన్ లో 128జీబీ ధరతో 256జీబీ వేరియంట్‌ను పొందవచ్చు. 256జీబీ వేరియంట్‌పై రూ. 5000 ఫ్లాట్ తగ్గింపును పొందుతారు. దీనికి అదనంగా ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేస్తే రూ. 8,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ ని కలిపితే, మీరు పై మొత్తం తగ్గింపును పొందవచ్చు. కాబట్టి అన్ని ఆఫర్‌లను కలిపిన తర్వాత, ధర రూ.66,999కి తగ్గుతుంది.

స్పెసిఫికేషన్లు..

గేలాక్సీ ఎస్ 23 ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్‌తో సహా మూడు రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2340×1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ర్యామ్+ 512జీబీ వరకు స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ సామర్థ్యాలతో అందుబాటులో ఉది. ఫోన్ పైన కస్టమ్ వన్ UI 5.1 స్కిప్‌తో Android 13 సామర్థ్యంతో పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

కెమెరా, బ్యాటరీ ఇలా..

గేలాక్సీ ఎస్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. 3900mAh బ్యాటరీతో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..