ఆయిల్ రిఫైనెర్ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వేగవంతమైన వాహన-బ్యాటరీ మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్లాన్ చేస్తుంది. ఎలక్ట్రిక్ టూ- త్రీ వీలర్ వాహనాల బ్యాటరీలను డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. తక్కువ కాలుష్య ఇంధనాలతో వాహనాలను వినియోగిస్తే భవిష్యత్‌లో బాగుంటుందని స్పష్టం చేసింది. రెండు రకాల వాహనాలు 80 శాతం రోడ్లపై నడుస్తాయని కంపెనీ తెలిపింది. బ్యాటరీలను 5 నిమిషాలపాటు ఛార్జింగ్ పెడితే పూర్తి స్థాయిలో బ్యాటరీ నిండుతుందన్నారు.