Revised ITR Filing: మీ ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు దొర్లాయా? కంగారు పడకండి.. సవరించుకునే అవకాశం ఉంది..

ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా, డాక్యుమెంట్లలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. పెనాల్టీలు పడతాయి. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునేందుకు ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం కల్పిస్తుంది. ఒరిజినల్ రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు ఏవైనా తప్పులు లేదా లోపాల వస్తే వాటిని మీరు సరిదిద్దుకోవచ్చు.

Revised ITR Filing: మీ ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు దొర్లాయా? కంగారు పడకండి.. సవరించుకునే అవకాశం ఉంది..
Itr

Updated on: May 31, 2024 | 5:47 PM

పన్ను చెల్లింపుదారులకు తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు తుది గడువు సమీపిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఐటీఆర్ దాఖలు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా, డాక్యుమెంట్లలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. పెనాల్టీలు పడతాయి. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునేందుకు ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం కల్పిస్తుంది. ఒరిజినల్ రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు ఏవైనా తప్పులు లేదా లోపాల వస్తే వాటిని మీరు సరిదిద్దుకోవచ్చు. అది ఎన్ని సార్లు సవరించుకునే అవకాశం ఉంది. దానిని ఎలా చేయాలి? తెలుసుకుందాం రండి..

ఐటీఆర్ ఫైల్ చేయడం ఎందుకు ముఖ్యం?

పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ మీ ఐటీఆర్ ని కచ్చితంగా ఫైల్ చేయాలి. ఇది మీ పన్ను బాధ్యతను గుర్తించడంలో, పన్ను వాపసులను క్లెయిమ్ చేయడంలో సహాయపడుతుంది. రుణ ఆమోదాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఇది తప్పనిసరి.

ఐటీఆర్‌ని ఎన్నిసార్లు రివైజ్ చేయవచ్చు?

వాస్తవానికి మీ ఐటీఆర్ ని ఎన్నిసార్లు సవరించవచ్చనే దానిపై పరిమితి లేదు. పేర్కొన్న గడువులోపు దీన్ని చేస్తే చాలు. మీ ఒరిజినల్ రిటర్న్‌లో ఏవైనా తప్పులు లేదా లోపాలను సరిచేసుకునే వెసులుబాటు ఉంది.

ఇవి గుర్తుంచుకోండి..

  • ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(5) మీరు సమర్పించిన ఒరిజినల్ రిటర్న్‌లో ఏవైనా లోపాలను గుర్తిస్తే సవరించిన ఐటీఆర్ ని ఫైల్ చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది.
  • ఒక వ్యక్తి రిటర్న్‌ను సమర్పించిన తర్వాత ఏదైనా పొరపాటు, లేదా తప్పు స్టేట్‌మెంట్‌ను కనుగొంటే, వారు నిర్ణీత గడువులోపు దాన్ని సవరించాలి.
  • అసెస్‌మెంట్ ఇయర్ ముగియడానికి మూడు నెలల ముందు లేదా అసెస్‌మెంట్ పూర్తయ్యే ముందు, ఏది మొదట వచ్చినా రిటర్న్‌ని రివైజ్ చేయవచ్చు.
  • ఒరిజినల్ రిటర్న్ పేపర్ ఫార్మాట్‌లో లేదా మాన్యువల్‌గా ఫైల్ చేస్తే సాంకేతికంగా ఆన్‌లైన్ లేదా ఎలక్ట్రానిక్‌గా రివైజ్ చేయడం కుదరదు.

ముఖ్యమైన తేదీలు ఇవి..

అసెస్‌మెంట్ ఇయర్: ఇది ఐటీఆర్ ఫైల్ చేస్తున్న ఆర్థిక సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి అసెస్ మెంట్ ఇయర్ 2024-25.

రివైజ్ చేయడానికి గడువు: మీ ఐటీఆర్ ని సవరించడానికి గడువు సాధారణంగా అసెస్‌మెంట్ సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన వస్తుంది.

ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ: ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) మీ ఐటీఆర్ ని ఫైల్ చేయడానికి గడువు జూలై 31, 2024. ఇది చాలా మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రామాణిక గడువు తేదీ. అయితే, ఖాతాలు ఆడిట్‌కు లోబడి ఉన్న పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక గడువు అక్టోబర్ 31, 2024 వరకూ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..