శాశ్వత ఖాతా సంఖ్య (పాన్ కార్డ్) అనేది భారతీయ పన్ను చెల్లింపుదారులకు జారీ చేయబడిన గుర్తింపు పత్రం. పాన్ కార్డ్ అనేది భారతదేశ ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) జారీ చేసిన జాతీయ గుర్తింపు కార్డు. పాన్ నంబర్ అనేది 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది ఒక వ్యక్తి అన్ని IT లావాదేవీలు, పన్ను చెల్లింపులు, టీడీఎస్/టీసీఎస్ క్రెడిట్‌లు, ఆర్థిక లావాదేవీలను ఒకే చోటికి తీసుకొచ్చేందుకు ఉపయోగించబడుతుంది. పాన్ కార్డ్ ప్రతి భారతీయ పన్ను చెల్లింపుదారునికి అవసరమైన పత్రం. అయితే, ఈ పాన్ కార్డ్ పోయినట్లయితే.. అప్పుడు చాలా సమస్య ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు ఇప్పుడు అదే టాస్క్‌లను పూర్తి చేయడానికి ఆన్‌లైన్‌లో సులభంగా ఇ-పాన్ కార్డ్‌ని పొందవచ్చు. పాన్ కార్డు కోసం దరఖాస్తుదారులు ఇప్పుడు ఈ యూటీఏఏటీఎస్ఎల్ వెబ్‌సైట్ ద్వారా నేరుగా తమ ఇ-పాన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ వెబ్‌సైట్‌లోని ఇ-పాన్ డౌన్‌లోడ్ సదుపాయం కొత్త పాన్ కోసం దరఖాస్తు చేసుకున్న లేదా యూటీఏఏటీఎస్ఎల్ తో తాజా మార్పులు/కరెక్షన్ అప్‌డేట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, ఆదాయపు పన్ను శాఖలో తమ పాన్ రికార్డుతో చెల్లుబాటు అయ్యే, క్రియాశీల మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌ను గతంలో నమోదు చేసుకున్న వారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం