Honda Vehicles Recalls : ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి రప్పించిన హోండా కంపెనీ.. కారణం ఏమిటంటే..?

|

Apr 02, 2021 | 8:42 AM

Honda Vehicles Recalls :సాధారణంగా కార్ల కంపెనీలు ఒక మోడల్‌ను తయారు చేసిన మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు అందులో ఏవైనా లోపాలు ఎదురైతే వాటిని రీకాల్‌ చేసి తిరిగి ...

Honda Vehicles Recalls : ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి రప్పించిన హోండా కంపెనీ.. కారణం ఏమిటంటే..?
Honda Vehicles
Follow us on

Honda Vehicles Recalls :సాధారణంగా కార్ల కంపెనీలు ఒక మోడల్‌ను తయారు చేసిన మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు అందులో ఏవైనా లోపాలు ఎదురైతే వాటిని రీకాల్‌ చేసి తిరిగి లోపాలను సరి చేసి మళ్లీ యజమానులకు అందిస్తుంటారు. అలా తాజాగా తచూగా పాడవుతున్న ఫ్యూయల్‌ పంప్‌లను మార్చడానికి, అలాగే ఈ పంపుల వల్ల ఇంజిన్‌ సమస్య తలెత్తకుండా ఉండడానికి హోండా కంపెనీ అమెరికాలోని 761,000 వాహనాలను రీకాల్‌ చేసిందని హోండా మోటారు వెల్లడించింది. నేషనల్‌ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ వివరించిన వివరాల ప్రకారం.. హోండా సంస్థ ఇలా ఉత్పత్తుల్లో లోపం కారణంగా కార్లను రీకాల్ చేయడం ఇది మొదటి సారేమి కాదు. అమెరికాలో 628,000 వాహనాలకు కూడా విక్రయించారు. అయితే ఇలాంటి ఫ్యూయల్‌ పంపుల కారణంగా ఎలాంటి ప్రమాదాలు, గాయాలు అయినట్లు ఇప్పటి వరకు హోండా కంపెనీకి ఎలాంటి సమాచారం లేదు. అయితే వీటి గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు సైతం అందలేదట. కానీ వాటిలోని లోపాల గురించి కంపెనీ గుర్తించి వాటిని రీకాల్‌ చేసింది.

తాజాగా ఈ రీకాల్‌లో ఆక్యూరా, హోండా రెంటింటికీ సంబంధించిన మోడళ్లు ఉన్నాయి. ఇందులో కొన్ని 2019 మోడళ్లే. మిగతా వాటిని 2020 మోడళ్లుగా కొనసాగిస్తున్నారు. ఆక్యూరా నుంచి ఐఎల్‌ ఎక్స్‌, ఎమ్‌డి ఎక్స్‌, ఎమ్‌డిఎక్స్‌ స్పోర్ట్స్‌ హైబ్రీడ్‌, ఆర్‌ డి ఎక్స్‌, టీఎల్‌ ఎక్స్ లాంటి కొన్ని మోడళ్లు ఉన్నాయి. ఇక హోండా కార్లలోనూ కొన్నింటికి ఈ రీకాల్‌ వర్తిస్తుంది. వాటిలో సివిక్‌, ఫిట్‌, హెచ్‌ఆర్‌-వి, ఒడిస్సీ, పాస్‌పోర్ట్‌, పైలెట్, రిడ్జ్‌లైన్‌. చివ‌రిగా 2018-19 మోడళ్లలో కొన్ని హోండా సిఆర్‌-వి మోడ‌ళ్లు కూడా ఉన్నాయి.

గత ఏడాదికి ముందు కూడా..

కాగా, గత ఏడాదికి ముందు కూడా ఇలాగే అమెరికాలో ఫ్యూయల్‌ పంప్‌ల విషయంలో లోపాలను గమనించి 136,057 వాహనాలను హోండా రీకాల్‌ చేసింది. 2019లో కూడా ఈ సంస్థ రెండు సార్లు కార్లు రీకాల్ చేసింది. ఫ్యూయల్ పంప్‌కు సంబంధించిన సమస్యల వల్ల వీటిని రీకాల్‌ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సంస్థ తరచూ తమ మోడళ్లను రీకాల్‌ చేస్తూనే ఉంది. కాబట్టి ఎక్కువ మంది యజమానులు ఈ సంస్థ వాహనాలు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ రీకాల్‌కు సంబంధించిన సమాచారం మీకు అందాలన్నా, మీ వాహనం కూడా అందులో భాగమా..? లేదా? తెలియాలన్నా ఈ కార్లు ఉన్నవారంతా హోండా రీకాల్‌ వెబ్‌సైట్‌లో VIN తో రిజిస్టర్ అవ్వడం మంచిదంటున్నారు.

ఇవీ చదవండి: Gold Price Today: బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Post Office Deposit: పోస్టాఫీసులో అదిరిపోయే డిపాజిట్‌ పథకం.. నెలకు 1000 డిపాజిట్‌ చేస్తే రూ.72 వేలు వడ్డీ పొందవచ్చు.. ఎలాగంటే..!

Xiaomi Mi Mix: మార్కెట్లో విడుదలైన షియోమీ ఫోల్డబుల్‌ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి..