Hero Lectro C6e
ఇటీవల కాలంలో ఈవీ వాహనాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే ఈవీ సైకిల్స్ మాత్రం పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేదు. అయితే నిర్వహణపరంగా అనువుగా ఉండే ఈవీ సైకిల్స్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో అన్ని కంపెనీలు అధునాతన ఫీచర్లతో ఈవీ సైకిల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేని వినియోగదారులను ఈ ఈవీ సైకిల్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. బైక్ సేల్స్ విభాగంలో అగ్రగామిగా ఉన్న హీరో కంపెనీ తాజాగా హీరో లెక్ట్రో సీ6ఈ 700 సీ పేరుతో సరికొత్త ఈవీను లాంచ్ చేసింది. ఈ ఈ-బైక్ తక్కువగా ప్రయాణించే వారితో పాటు సున్నితమైన వ్యాయామం చేసే వారికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఈ ఈవీ సైకిల్ కచ్చితంగా పట్టణ ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లెక్ట్రో సీ6ఈ 700సీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
హీరో లెక్ట్రో సీ6ఈ 700 సీ ప్రత్యేకతలు
- దాదాపు రూ.30,000 అంచనా ధరతో సీ6ఈ 700సీ బడ్జెట్-స్నేహపూర్వక ధరలో వస్తుంది.
- మల్టిపుల్ కలర్ ఆప్షన్‌లలో వచ్చే ఈ ఈ-బైక్ యునిసెక్స్ ఫ్రేమ్ డిజైన్‌తో సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది
- 250 వాట్స్ బీఎల్‌డీసీ (బ్రష్‌లెస్ డీసీ) మోటార్‌తో వచ్చే ఈ బైక్ నగర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.
- 5.8 ఏహెచ్ ఐపీ 67 రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ శ్రేణి నగర పరిమితుల్లో చిన్న ప్రయాణాలకు లేదా విశ్రాంతి సైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
- నిర్దిష్ట ఛార్జింగ్ సమయాలు ఇంకా వెల్లడి కానప్పటికీ ఈ-బైక్ వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.
- 7-స్పీడ్ గేర్లతో వచ్చే ఈ-బైక్ గాలి నిరోధకత ఆధారంగా పెడలింగ్ ప్రయత్నాన్ని సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది.
- ఈ-బైక్ మూడు మోడ్స్‌లో వస్తుంది. రైడర్‌లు తమకు కావాల్సిన ఎలక్ట్రిక్ మోటార్ సహాయాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
- ఈ-బైక్‌తో వచ్చే డిస్క్ బ్రేక్‌లు అన్ని వాతావరణ పరిస్థితులలో నమ్మకమైన స్టాపింగ్ పవర్‌ను అందిస్తాయి.
- ఈ-బైక్ విభాగంలో కొత్తగా ప్రవేశించినందున ఈ-బైక్‌ల కోసం హీరో సర్వీస్ నెట్‌వర్క్ అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు. మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ లభ్యత కోసం తనిఖీ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..