Hero Motorcorp: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. జూలై 3 అంటే నేటి నుంచి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని బైక్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి 2 శాతం ధరలు పెంచిన కంపెనీ, ఇప్పుడు మరోసారి పెంచి బిగ్ షాక్ ఇచ్చింది. కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు, ముడి పదార్థాల ధరలు, అన్నింటిని బేరీజు వేసుకుని ధరలు పెంచడం జరిగిందని కంపెనీ ప్రకటించింది. హీరో ప్రకటన ప్రకారం.. అన్ని రకాల బైక్స్, స్కూటీలపై ధరలు పెరగనున్నాయి.
స్కూటర్లు, బైక్‌ల ధరలు పెంపుపై హీరో మోటోకార్ప్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతుంటుంది. ఇందులో భాగంగానే ద్విచక్రవాహనాల ధరలన పెంచినట్లు తెలిపింది. సమీక్ష సమయంలో కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు, ముడి పదార్థాల ధరలు, వ్యాపార కార్యక్రమాలు సహా అనేక అంశాలను అంచనా వేసి, దాని ఆధారంగా ధరలు పెంచడం జరిగిందని తెలిపింది మోటో కార్ప్.
హీరో మోటోకార్ప్ ద్విచక్రవాహనాల ధరలను ప్రస్తుతం ఉన్న ధరకంటే 1.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధర దేశ వ్యాప్తంగా జూన్ 3 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, ఆయా నగరాల్లో ద్విచక్రవాహనాల ధరలు మారే అవకాశం ఉంటుంది.
హీరో మోటోకార్ప్ యూనిట్స్ విక్రయాలను పరిశీలిస్తే.. జూన్ నెల చివరి నాటికి కంపెనీ 4,36,993 యూనిట్లను విక్రయించింది. ఇదే సమయంలో గతేడాది జూన్‌లో 4,84,867 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దీని ప్రకారం.. ఏడాది కాలంలో కంపెనీ విక్రయాలు 9.87 శాతం పడిపోయాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..