Hero Electric: ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయడం సులభం కానుంది. హీరో ఎలక్ట్రిక్ తన ద్విచక్ర వాహన విక్రయం కోసం యాక్సిస్ బ్యాంక్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో కస్టమర్ చాలా సులభమైన మార్గంలో రుణం పొందవచ్చు . పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో వాహనతయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురాగా, హీరో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కు చెందిన స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.
యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ హీరో ఎలక్ట్రిక్ తన మొత్తం ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో కోసం కస్టమర్లకు రిటైల్ లోన్ (ఫైనాన్సింగ్) సౌకర్యాన్ని అందించడానికి ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టింది. 750 కంటే ఎక్కువ మంది డీలర్ల కంపెనీ నెట్‌వర్క్‌లో కస్టమర్లు ద్విచక్ర వాహన ఫైనాన్సింగ్‌ను ఎంచుకోవచ్చని.. హీరో ఎలక్ట్రిక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంతో కస్టమర్‌లకు ఎంతగానే మేలు జరగనుంది. హీరో నుంచి వివిధ వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ.75,000 లకు హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ హెచ్‌ఎక్స్, రూ.66 వేలకున హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్‌ఎక్స్ డబుల్ బ్యాటరీ, రూ.56 వేలకు హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్‌ఎక్స్ సింగిల్ బ్యాటరీని అందిస్తోంది.
హీరో ఎలక్ట్రిక్ గత నెలలోనే మహీంద్రా గ్రూప్‌తో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో వ్యూహాత్మక టై-అప్‌ను ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో, మహీంద్రా గ్రూప్ పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి మధ్యప్రదేశ్‌లోని పితాంపూర్‌లోని ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్ బైక్‌లు ‘ఆప్టిమా’, ‘ఎన్‌వైఎక్స్’లను తయారు చేయనున్నట్లు రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. హీరో ఈ ఏడాది చివరి వరకు ఒక మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.
అదే సమయంలో, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు డెలివరీ సొల్యూషన్స్ ప్రొవైడర్ స్టార్టప్ టర్టిల్ మొబిలిటీతో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద, హీరో ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ టర్టిల్ మొబిలిటీకి 1,000 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పంపిణీ చేస్తుంది. ఇది సరఫరా విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి 2021 రెండవ త్రైమాసికంలో చేర్చబడింది. అదే సమయంలో హీరో ఎలక్ట్రిక్ ప్రైవేట్ గ్యారేజ్ యజమానులకు శిక్షణ ఇవ్వడానికి, వారి నెట్‌వర్క్‌ను ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సర్వీస్ సెంటర్‌లుగా ఉపయోగించుకోవడానికి SpareItతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, హీరో ఎలక్ట్రిక్ యొక్క బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కస్టమర్ కస్టమర్ల కోసం SpareIt ఈ గ్యారేజీలను సులభతరం చేస్తుందని కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి: