Post Office Scheme: మీ డబ్బును డబుల్‌ చేసే స్కీమ్‌ ఇది.. పూర్తి వివరాలు

|

Jul 18, 2024 | 6:47 PM

సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వ్యక్తులు తరచూ బ్యాంకులో ఎఫ్‌డీ చేస్తారు. అయితే మీరు దీర్ఘకాలిక ఎఫ్‌డీ చేయాలనుకుంటే, ఒకసారి పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టండి. పోస్టాఫీసు ఎఫ్‌డీని పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (పోస్ట్ ఆఫీస్ టీడీ) అని అంటారు. ఇక్కడ మీరు 1, 2, 3, 5 సంవత్సరాల వ్యవధుల్లో మీకు టీడీ అందుబాటులో ఉంటుంది. అన్నింటిపై వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటాయి.

Post Office Scheme: మీ డబ్బును డబుల్‌ చేసే స్కీమ్‌ ఇది.. పూర్తి వివరాలు
Follow us on

ఏదైనా మంచి పెట్టుబడి పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా? అది కూడా సురక్షితమైన, కచ్చితమైన రాబడి వచ్చేదై ఉండాలని ఆశపడుతున్నారా? అయితే ఈ కథకం మీ కోసమే. మన పోస్టాఫీసుల్లో అనేక సురక్షిత పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మెరుగైన వడ్డీ రేట్లు ఉంటాయి. కొన్ని సంవత్సరాలలోనే మీ పెట్టుబడి మొత్తాన్ని రెండింతలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాంటి పథకాలలో బెస్ట్‌ పథకాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. దాని పేరు పోస్ట్‌ ఆఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ స్కీమ్‌. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టాఫీస్‌ టైం డిపాజిట్‌..

సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వ్యక్తులు తరచూ బ్యాంకులో ఎఫ్‌డీ చేస్తారు. అయితే మీరు దీర్ఘకాలిక ఎఫ్‌డీ చేయాలనుకుంటే, ఒకసారి పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టండి. పోస్టాఫీసు ఎఫ్‌డీని పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (పోస్ట్ ఆఫీస్ టీడీ) అని అంటారు. ఇక్కడ మీరు 1, 2, 3, 5 సంవత్సరాల వ్యవధుల్లో మీకు టీడీ అందుబాటులో ఉంటుంది. అన్నింటిపై వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటాయి. ఐదేళ్ల కాలవ్యవధితో తీసుకుంటే దీనిపై వచ్చే వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది. మీరు ఈ స్కీమ్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే, అది కొన్ని సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువగా అవుతుంది. ఆ లెక్క ఇప్పుడు చూద్దాం..

పోస్టాఫీసు టీడీ వడ్డీ రేట్లు..

  • ఒక సంవత్సరం కాలవ్యవధికి 6.9% వార్షిక వడ్డీ
  • రెండేళ్ల ఖాతాపై 7.0%
  • మూడేళ్ల ఖాతాపై 7.1%
  • ఐదు సంవత్సరాల ఖాతాపై వార్షిక వడ్డీ 7.5%

మీ డబ్బులు డబల్‌ కావాలంటే..

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ మీ పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేయవచ్చు. అయితే దీని కోసం మీరు ఒక పని చేయాలి. ముందుగా మీరు 5 సంవత్సరాలకు రూ.5 లక్షల ఎఫ్‌డీ చేయాలి. కానీ 5 సంవత్సరాల తర్వాత మీరు ఈ ఎఫ్‌డీని మరో 5 సంవత్సరాలకు ఎక్స్‌టెండ్‌ చేయాలి. ఈ విధంగా మీ ఎఫ్‌డీ కాలవ్యవధి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా మీరు 5 లక్షల పెట్టుబడిపై ₹10,51,175 పొందుతారు.

లెక్క ఇలా..

మీరు 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసు ఎఫ్‌డీలో 5 లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేసినప్పుడు, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ కాలిక్యులేటర్ ప్రకారం, 7.5 శాతం వడ్డీ రేటుతో, మీకు వడ్డీగా రూ. 2,24,974 లభిస్తుంది. అంటే, 5 సంవత్సరాల తర్వాత, మీరు ఈ మొత్తాన్ని 7,24,974గా పొందుతారు. కానీ మీరు ఈ మొత్తాన్ని తదుపరి 5 సంవత్సరాలకు మళ్లీ ఫిక్స్ చేసినప్పుడు, 7.5 శాతం వడ్డీ రేటుతో మీకు కేవలం వడ్డీనే రూ. 3,26,201 లభిస్తుంది. రూ.7,24,974 + రూ.3,26,201 కలిపితే మొత్తం రూ.10,51,175 వస్తుంది. ఈ విధంగా మీరు మెచ్యూరిటీపై రూ. 10,51,175 పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..