Electric car: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 800 కిలోమీటర్లు.. ఈ కారు లుక్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

ఇటాలియన్ ఈవీ స్టార్టప్ కంపెనీ ఎహ్రా(Aehra) సెడాన్ మోడల్ లో ఓ లగ్జరీ కారును పరిచయం చేసింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ కారు గరిష్టంగా గంటకు 265 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అలాగే బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 800కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

Electric car: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 800 కిలోమీటర్లు.. ఈ కారు లుక్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
Aehra Electric Car

Updated on: Jun 24, 2023 | 5:30 PM

గ్లోబల్ వైడ్ గా విద్యుత్ శ్రేణి వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఉత్పత్తులను ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. హై ఎండ్ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టెస్లా కార్లకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దాని రేంజ్ ని అందుకునేందుకు అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇదే క్రమంలో ఇటాలియన్ ఈవీ స్టార్టప్ కంపెనీ ఎహ్రా(Aehra) సెడాన్ మోడల్ లో ఓ లగ్జరీ కారును పరిచయం చేసింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ కారు గరిష్టంగా గంటకు 265 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అలాగే బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 800కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వచ్చే ఏడాది నుంచి ప్రీ బుకింగ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లగ్జరీ కార్ల డిజైనర్..

ఎహ్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ గా ఫిలిప్పో పెరిని వ్యవహిరిస్తున్నారు. ఈయన గతంలో ఆడి, లంబోర్ఘిని, ఇటాల్‌డిజైన్‌లకు డిజైనర్‌గా పనిచేయడం విశేషం. అంతేకాక అధిక సామర్థ్యం కలిగి బ్యాటరీ తయారీ కోసం ఆస్ట్రేలియన్ మిబా బ్యాటరీ సిస్టమ్స్ తో కలిసి పనిచేస్తోంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, పవర్ ట్రైన్, ఫీచర్లను ఆ కంపెనీ వెల్లడించలేదు. అయితే అంచనాలు పెంచేలా డిజైన్, లుక్ ని రివీల్ చేశారు. అలాగే రేంజ్ ను ప్రకటించారు. బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్లు ఆగకుండ ప్రయాణించగలుతుంది.

లుక్.. ఫీచర్లు..

సెడాన్ హై-ఎండ్ ఈవీ మోడల్ కారు ఎరుపు రంగులో చాలా లగ్జరీగా కనిపిస్తుంది. దీనికి సాధారణ డోర్స్ కాకుండా పైకీ లేచే విధంగా ఉన్నాయి. దూకుడుగా కనిపించే ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది. దీనిలో ఇది రీడిజైన్ చేసి బానెట్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్), బంపర్-మౌంటెడ్ ఫాగ్‌ల్యాంప్‌లతో కూడిన సున్నితమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీంతోపాటు ఫ్రంట్ ఎయిర్ స్ప్లిటర్, ఓఆర్వీఎంల స్థానంలో కెమెరాలు, ఒక రేక్డ్ విండ్‌స్క్రీన్, వాలుగా ఉండే రూఫ్‌లైన్, పైకి తెరుచుకునే డబుల్ టెయిల్ ల్యాంప్స్, ఫాల్కన్ డోర్లు, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాహనం టెస్టింగ్ దశలో ఉంది. దీనిని 2025 నాటికి ప్రారంభించవచ్చు. అదే సమయంలో దీని డెలివరీ 2026 నాటికి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..