Electric Scooter: కొత్త స్కూటర్ కొనాలనుకొంటున్నారా? రూ.3వేలు ఉంటే చాలు.. 120కిమీ రేంజ్ ఇచ్చే స్కూటర్ మీ సొంతం..

|

Jun 24, 2023 | 6:00 PM

మార్కెట్లో ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1,16,000(ఎక్స్ షోరూం) ఉంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం రూ. 20,000 డౌన్ పేమెంట్ తో ఈ స్కూటర్ ని కొనుగోలు చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్లో నెలకు కేవలం రూ. 3,487చొప్పున చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Electric Scooter: కొత్త స్కూటర్ కొనాలనుకొంటున్నారా? రూ.3వేలు ఉంటే చాలు.. 120కిమీ రేంజ్ ఇచ్చే స్కూటర్ మీ సొంతం..
Rowwet Eleq
Follow us on

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు బాగా డిమాండ్ పెరిగింది. పెట్రోల్ రేట్లు అమాంతం పెరిగిపోవడం, ప్రభుత్వాలు పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహిస్తుండటం కూడా ఈ డిమాండ్ కు కారణం. అర్బన్ ప్రాంత ప్రజల అవసరాలకు సరిగ్గా సరిపోతుండంతో ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ కూడా ఉత్తమ ఉత్పత్తులను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. రొవ్వెట్(Rowwet) మొబలిటీ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని పేరు రొవ్వెట్ ఎలెక్(Rowwet Eleq). దీనిలో 72V/30Ah సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 120కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రొవ్వెట్ ఎలెక్ స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2000వాట్ల సామర్థ్యంతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది చూడటానికి ఫ్యూజన్ స్టైల్ లో ఉంటుంది. డిస్క్ బ్రేకులు ఇచ్చారు. గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలగుతుంది. పెద్ద అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. దీనిలోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి మూడు గంటల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ అయితే 120 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలుగుతుంది.

ఫీచర్లు ఇవి..

ఈ స్కూటర్లో యూఎస్బీ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. రెట్రో లుక్ ఉండే ఈ స్కూటర్ కి పెద్ద టర్న్ ఇండికేటర్లు, టైల్ ల్యాంప్ ఉంటుంది. ఫుల్ హెడ్ ల్యాంప్ కవర్, డీఆర్ఎల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

మార్కెట్లో ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1,16,000(ఎక్స్ షోరూం) ఉంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం రూ. 20,000 డౌన్ పేమెంట్ తో ఈ స్కూటర్ ని కొనుగోలు చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్లో నెలకు కేవలం రూ. 3,487చొప్పున చెల్లించి ఇంటికి తీసుకెళ్ల వచ్చు. వడ్డీ రేటు 9.7శాతం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం దగ్గరలోని డీలర్ ను సంప్రదించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..