LIC Policy: రోజుకి రూ. 252 పెట్టుబడితో రూ. 54 లక్షలు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు

|

May 16, 2023 | 12:00 PM

అన్ని వర్గాల వారికి ఉపయుక్తంగా ఉండే అనేక పథకాలు తీసుకొస్తుంది. అటువంటి పథకాలలో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఒకటి. ఈ పాలసీతో పాలసీదారులు బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను పొందుతారు. అనుకోని సందర్భాల్లో పాలసీ హోల్డర్‌ చనిపోతే నామినీకి డెత్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తారు.

LIC Policy: రోజుకి రూ. 252 పెట్టుబడితో రూ. 54 లక్షలు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు
Lic Policy
Follow us on

దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ). ప్రజల్లో దీనిపై అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి తగ్గట్లుగానే  ఎల్‌ఐసీ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అద్భుత పథకాలను అందిస్తూనే ఉంటుంది.అన్ని వర్గాల వారికి ఉపయుక్తంగా ఉండే అనేక పథకాలు తీసుకొస్తుంది. అటువంటి పథకాలలో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఒకటి. ఈ పాలసీతో పాలసీదారులు బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను పొందుతారు. అనుకోని సందర్భాల్లో పాలసీ హోల్డర్‌ చనిపోతే నామినీకి డెత్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది ఎల్‌ఐసీ జీవన్‌ లాభ్‌ పాలసీ..

ఇది దీర్ఘకాలిక పథకం. ఐదు, పది, పదిహేను సంవత్సరాల వ్యవధితో పాలసీ తీసుకోవచ్చు. కనీసం మొత్తం రూ. 5లక్షలతో పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియంలు నెలనెలా కట్టొచ్చు. ప్లాన్‌ మధ్యలో మీరు కట్టిన ప్రీమియంపై రుణ సదుపాయాన్ని కూడా అందిస్తారు.

‍ప్రయోజనాలు ఇవి..

ఎల్‌ఐసీ జీవన్‌ లాభ్‌ పథకం ద్వారా డెత్‌ బెనిఫిట్‌ పొందచ్చు. అలాగే మెచ్యూరిటీ తర్వాత పూర్తి మొత్తాన్ని తీసుకోవచ్చు. పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అలాగే పాలసీదారులు ఐదు రకాల ఆప్షనల్‌ రైడర్‌ ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పాలసీ ఇలా తీసుకోవాలి..

పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా గరిష్ట వయస్సు 59 ఏళ్లు. ఉదాహరణకు, వినియోగదారుడు జీవన్ లాభ్‌లో 25 ఏళ్ల వయస్సులో నమోదు చేసుకుంటే, వారు నెలకు రూ. 7,572 లేదా రూ. రోజుకు 252 ప్రీమియంగా చెల్లించాలి. మెచ్యూరిటీ సమయంలో వారు రూ. 54 లక్షలు అందుకుంటారు. ఇది రూ. 20 లక్షల బీమా పాలసీ. దీని కోసం మీరు చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ. 90,867గా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..