Health Care: ఆస్పత్రి ఖర్చులతో జేబులకు చెల్లులు పడ్డట్లు ఉంటుందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

|

Jun 17, 2023 | 5:45 PM

శక్తికి మించి ఖర్చులు పెరిగి పోతుంటే ఎవరైనా ఏం చేస్తారు. ఆస్పత్రుల బిల్లలు చెల్లించడానికి జీతం మొత్తం అయిపోతుంటే ఇక బతికేదెలా? దీనికి పరిష్కారం లేదా? అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు.

Health Care: ఆస్పత్రి ఖర్చులతో జేబులకు చెల్లులు పడ్డట్లు ఉంటుందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Insurance
Follow us on

ఆరోగ్యమే ఆనందం అంటుంటారు పెద్దలు. నిజమే మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎంత కష్టమైన పడగలుతాడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాడు. అయితే ప్రస్తుత కాలంలో మనిషికి ఆరోగ్యమే కొదువైపోయింది. యువకులకే గుండెపోట్లు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సోకుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్పత్రుల బిల్లులు తడిసిమోపడవుతుంటాయి. శక్తికి మించి ఖర్చులు పెరిగి పోతుంటే ఎవరైనా ఏం చేస్తారు. ఆస్పత్రుల బిల్లులు చెల్లించడానికి జీతం మొత్తం అయిపోతుంటే ఇక బతికేదెలా? దీనికి పరిష్కారం లేదా? అంటే ఉందనే చెబుతున్నారు నిపుణులు. కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల ఆస్పత్రుల బిల్లలు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

ఆరోగ్య బీమా ఉన్నా సమస్యే.. కరోనా అనంతర కాలంలో అందరూ హెల్ట్ ఇన్సురెన్స్ ను అందరూ కలిగి ఉంటున్నారు. దీనిని ఓ భరోసాగా అందరూ భావిస్తున్నారు. అయితే ఇది ఉన్నప్పటికీ కొంత మంది ఆస్పత్రులకు తమ జేబులోలని నగదును అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఎందుకంటే ఆరోగ్య బీమా పాలసీలు ఇన్‌పేషెంట్ ఖర్చులను మాత్రమే కవర్ చేస్తాయి. మీరు 24 గంటల కంటే ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఓపీడీ ఖర్చులు కవరేజీ లోకి రావు. అటువంటప్పుడు మరేం చేయాలి? ఈ ఇవిగో ఈ టిప్స్ ఫాలో అవ్వాలి..

సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ.. ఓపీడీ కవరేజితో కూడిన ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలి. దీని ద్వారా కేవలం ఆస్పత్రిలో చేరినప్పుడ కాకుండా ఓపీ చార్జీలు, ఇతర పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్ వంటివి కూడా కవర్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

ప్రివెంటివ్ హెల్త్ కేర్‌ అవసరం.. నివారణ అనేది చాలా ముఖ్యమైన ఔషధం అని తరచుగా చెబుతారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో కూడా మీరు ముందస్తు ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారిస్తే, మీరు చాలా సంపదను ఆదా చేయవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రాక్టీస్‌లలో రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, టీకాలు వేయడం, క్యాన్సర్ మరియు పీసీఓడీ వంటి క్లిష్టమైన వ్యాధుల కోసం స్క్రీనింగ్ ఉన్నాయి. మీరు ఇప్పుడు నివారణ ఆరోగ్య సంరక్షణ కోసం కొంచెం ఖర్చు చేస్తే, మీ జీవితంలోని తరువాతి దశలలో తీవ్రమైన అనారోగ్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

ఆరోగ్యం, సంరక్షణ క్రెడిట్ కార్డ్‌లు.. ఆరోగ్య, సంరక్షణ కార్డ్‌లను అందించే కొన్ని ఆర్థిక సంస్థలు మీ జేబులో లేని ఆరోగ్య ఖర్చులను తగ్గించడంలో మీకు సహాయపడతాయి. మీరు ఈ కార్డ్‌ని పొందినట్లయితే, మీరు నెలకు పరిమిత వీడియో డాక్టర్ సంప్రదింపులను పొందవచ్చు. మీరు మీ ఫార్మసీలో ఖర్చు చేసినప్పుడు రివార్డ్ పాయింట్‌లను కూడా పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..