FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల్లో ఎస్బీఐ కన్నా అధిక వడ్డీ..

| Edited By: Ram Naramaneni

Nov 01, 2023 | 10:13 PM

ఎఫ్‌డీ చేయాలంటే మొదటిగా ఎంపిక చేసుకునేది పోస్ట్ ఆఫీసులు, అలాగే బ్యాంకులు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). వీటిలో అయితే మంచి రాబడితోపాటు ప్రభుత్వ భరోసా ఉంటుందని వినియోగదారుల నమ్మకం. ముఖ్యంగా బ్యాంకుల్లో చేసే వారికి ఎస్బీఐ మొదటి ఎంపికగా ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో చేసిన మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎస్బీఐ 36% వాటాను కలిగి ఉంది. అయితే ఇది ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందించదు. ఎస్బీఐ కన్నా అధిక వడ్డీ రేటు అందించే ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలానే ఉన్నాయి.

FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా.. ఈ బ్యాంకుల్లో ఎస్బీఐ కన్నా అధిక వడ్డీ..
Fixed Deposit
Follow us on

ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ).. మన దేశంలో అత్యం ప్రజాదరణ పొందిన పథకం. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ కు ఎక్కువ దీనిలో పెట్టుబడులు పెడతారు. అధిక వడ్డీతో పాటు, భద్రత, పన్ను రాయితీలు ఉండటంతో అందరూ దీనిని ఎంపిక చేసుకుంటారు. ఎక్కువ శాతం మంది ఈ ఎఫ్‌డీ చేయాలంటే మొదటిగా ఎంపిక చేసుకునేది పోస్ట్ ఆఫీసులు, అలాగే బ్యాంకులు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). వీటిలో అయితే మంచి రాబడితోపాటు ప్రభుత్వ భరోసా ఉంటుందని వినియోగదారుల నమ్మకం. ముఖ్యంగా బ్యాంకుల్లో చేసే వారికి ఎస్బీఐ మొదటి ఎంపికగా ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో చేసిన మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎస్బీఐ 36% వాటాను కలిగి ఉంది. అయితే ఇది ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందించదు. ఎస్బీఐ కన్నా అధిక వడ్డీ రేటు అందించే ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలానే ఉన్నాయి. 7% కంటే ఎక్కువ వడ్డీని అందించే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇది సాధారణంగా ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 సంవత్సరాల కాలవ్యవధికి ఎఫ్‌డీలపై 7.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ నేపథ్యంలో మూడేళ్ల కాలపరిమితితో ఉంటే ఎఫ్‌డీలపై ఉత్తమ వడ్డీ రేట్లు అందించే ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాను మీకు అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి.

బ్యాంక్ ఆఫ్ బరోడా.. ప్రస్తుతం ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది మూడేళ్ల ఎఫ్‌డీలపై 7.25% వరకు ఆఫర్ చేస్తుంది. ఎఫ్‌డీలో రూ. 1,00,000 పెట్టుబడి మూడేళ్లలో రూ. 1.24 లక్షలకు పెరుగుతుంది. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని మొత్తం ఎఫ్‌డీలలో బ్యాంక్ ఆఫ్ బరోడా 10% వాటాను కలిగి ఉంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ బ్యాంకులో మూడేళ్ల ఎఫ్‌డీపై 7% వరకు వడ్డీని పొందవచ్చు. దీనిలో రూ. 1,00,000 పెట్టుబడి పెడితే మూడేళ్లలో రూ. 1.23 లక్షలకు పెరుగుతుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉంచిన మొత్తం ఎఫ్‌డీలలో పీఎన్బీకి 10% వాటా ఉంది.

ఇవి కూడా చదవండి

కెనరా బ్యాంక్.. ఈ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డీపై 6.8% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. కెనరా బ్యాంక్ ఎఫ్‌డీలో రూ. 100,000 పెట్టుబడి మూడేళ్లలో రూ. 1.22 లక్షలకు పెరుగుతుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.5% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మూడేళ్ల ఎఫ్‌డీలో రూ. 1,00,000 పెట్టుబడి మూడేళ్లలో రూ. 1.21 లక్షలకు పెరుగుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల పరంగా ఐదో స్థానంలో ఉంది. మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.5% వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. ఎస్బీఐ ఎఫ్‌డీలో రూ. 1,00,000 పెట్టుబడి మూడేళ్లలో రూ. 1.21 లక్షలకు పెరుగుతుంది.

యూకో బ్యాంక్.. ఈ బ్యాంక్ మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.3% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. దీనిలో రూ. 1,00,000 పెట్టుబడి పెడితే మూడేళ్లలో రూ. 1.21 లక్షలకు పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..