Telugu News Business Here are the latest FD interest rates in top banks, check details in telugu
FD Interest Rates: టాప్ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇవి.. అత్యధికం ఎక్కడంటే..
మన దేశంలో టాప్ బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఒకసారి చూద్దాం. రూ. 2కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చితే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. అదే సమయంలో ఎస్‌బీఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తోంది.
సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకటి. వీటిల్లో కచ్చితమైన రాబడితో పాటు మీ సొమ్ముకు భద్రత ఉంటుంది. అధిక వడ్డీ రేటు కూడా ఉంటుంది. పైగా ఇటీవల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు బ్యాంకులు పెంచుతూనే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా కొనసాగించడమే. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సౌకర్యవంతమైన మార్జిన్‌లో ద్రవ్యోల్బణాన్ని అధిగమించి ఆకర్షణీయంగా మారాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో టాప్ బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఒకసారి చూద్దాం. రూ. 2కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చితే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. అదే సమయంలో ఎస్‌బీఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో పూర్తి వడ్డీ వివరాలను ఇప్పుడు చూద్దాం..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో తాజా వడ్డీ రేట్లు..
రూ. 2కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకులో వార్షిక వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.