
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రూ.10 చాయ్ తాగి కూడా అంతా ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నారు. జేబులో డబ్బులు పెట్టుకోవడమే చాలా మంది మర్చిపోయారు. ఫోన్లో డబ్బులుంటే చాలు.. ఎక్కడికి వెళ్లినా? ఏ అవసరమైనా.. స్కాన్ చేస్తామంటున్నారు. అయితే ఇంతగా డిజిటల్‌పై ఆధారపడటం కొన్ని సార్లు ఇబ్బందులకు గురి చేయవచ్చు. అత్యవసరమైన సమయంలో ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడమో, డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడమో, ఫోన్లో డేటా అయిపోవడమో, కొన్ని సార్లు బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి.
ఇలాంటి సమయాల్లో డిజిటల్ పేమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడే వాళ్లు బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ తెలియకుండా వచ్చే.. సందర్భాలు. కానీ, ఇప్పుడు ఓ బ్యాంక్ ముందుగానే మీకో అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 8 తేదీన తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 6.30 వరకు తమ యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు అంటూ పేర్కొంది. ఈ ప్రకటన చేసింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి 8 జూన్ 2025న ఉదయం 02:30 నుండి ఉదయం 06:30 వరకు (4 గంటలు) అవసరమైన సిస్టమ్ మేయిటేనెన్స్ కోసం సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
అంటే ఆ నాలుగు గంటలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులు తమ హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ నుంచి యూపీఐ సేవలు ఉపయోగించలేరు. ఈ విషయాన్ని గమనించి.. ముందుగానే తమ అవసరాలకు నగదు చేతిలో పెట్టుకోండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు ఈ విషయం తప్పక గమనించాలి. అయితే.. ఈ సమయంలో లావాదేవీలకు PayZapp వాలెట్‌ను ఉపయోగించమని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..