HDFC Bank: ఆగస్ట్‌ 22న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

HDFC Bank: వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి, మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ నిర్వహణ జరుగుతోందని బ్యాంక్ తెలిపింది. ఈ అంతరాయానికి HDFC బ్యాంక్ కస్టమర్లు సహకరించాలని తెలిపింది. ఈ అప్‌గ్రేడ్‌లు భవిష్యత్తులో సేవల విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొంది..

HDFC Bank: ఆగస్ట్‌ 22న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

Updated on: Aug 16, 2025 | 3:24 PM

ప్రతిరోజూ బ్యాంకుకు సంబంధించిన కొన్ని పనులు చేస్తుంటాము. ఇందులో UPI చెల్లింపు నుండి బ్యాలెన్స్ తనిఖీ చేయడం వరకు ప్రతిదీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టెక్నికల్‌గా సమస్య తలెత్తుతుంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు. దాని కస్టమర్లు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో HDFC బ్యాంక్ కొన్ని సేవలు 7 గంటలు నిలిచిపోనున్నాయి.HDFC బ్యాంక్ కస్టమర్లు ఇబ్బందులను నివారించడానికి వారి బ్యాంకు సంబంధిత పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలి. HDFC బ్యాంక్ ఏ సేవ ఎప్పుడు, ఏ సమయంలో నిలిచిపోతుందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోదీ రైతులకు బంపర్‌ గిఫ్ట్‌.. మరో కొత్త స్కీమ్.. త్వరలో ప్రారంభం..!

ఈ నెల చివరిలో కొన్ని సర్వీసులకు అంతరాయం కలుగనుందని బ్యాంకు తెలిపింది.బ్యాంకు సిస్టమ్‌లను మరింతగా అప్‌డేట్‌ చేసేందుకు ఆగస్టు 22, 2025న రాత్రి 11:00 గంటల నుండి ఆగస్టు 23, 2025న ఉదయం 6:00 గంటల వరకు మొత్తం 7 గంటల వరకు బ్యాంకు సేవల్లో అంతరాయం కలుగనుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఏ సేవలు నిలిచిపోతాయి?

ఈ కాలంలో ఫోన్ బ్యాంకింగ్ IVR, ఇమెయిల్ సపోర్ట్, సోషల్ మీడియా ఛానెల్స్, వాట్సాప్‌లో చాట్ బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్ వంటి కస్టమర్ కేర్ సేవలు అందుబాటులో ఉండవు. టోల్‌ ఫ్రీ నంబర్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సర్వీస్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేజాప్, మైకార్డ్స్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా వినియోగదారులు తమ లావాదేవీలను కొనసాగించవచ్చు.

వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి, మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ నిర్వహణ జరుగుతోందని బ్యాంక్ తెలిపింది. ఈ అంతరాయానికి HDFC బ్యాంక్ కస్టమర్లు సహకరించాలని తెలిపింది. ఈ అప్‌గ్రేడ్‌లు భవిష్యత్తులో సేవల విశ్వసనీయతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వీటిపై 75 శాతం రాయితీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి