HDFC Bank: రుణగ్రహీతలకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..

|

Jun 07, 2022 | 4:19 PM

ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రుణదాత అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. బ్యాంక్ మార్జిన్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను (MCLR) 35 బేసిస్ పాయింట్లు పెంచింది...

HDFC Bank: రుణగ్రహీతలకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..
HDFC
Follow us on

ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రుణదాత అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. బ్యాంక్ మార్జిన్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను (MCLR) 35 బేసిస్ పాయింట్లు పెంచింది. HDFC బ్యాంక్ కొత్త రేట్లు 7 జూన్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఓవర్‌నైట్ లోన్‌ల కోసం MCLR ఇప్పుడు 7.15 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఒక నెల MCLR 7.55 శాతానికి, మూడు నెలలకు 7.60 శాతానికి పెరిగింది. ఆర్‌బిఐ సమావేశ ఫలితాలు వెలువడే ముందు సోమవారం కెనరా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ తమ రుణ రేట్లను మార్చాయి. ఇప్పుడు 6 నెలలకు MCLR 7.35 శాతం నుంచి 7.70 శాతానికి, ఒక సంవత్సరానికి 7.85 శాతానికి, 2 సంవత్సరాలకు 7.95 శాతానికి, 3 సంవత్సరాలకు 8.05 శాతానికి పెరిగింది. చాలా రుణాలు ఒక సంవత్సరం కాలపరిమితితో MCLRకి లింక్ చేశారు.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వారంలో రెండోసారి రుణ రేట్లను పెంచింది. ఇంతకుముందు బ్యాంక్ జూన్ 1, 2022న గృహ రుణాల రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరుగుతున్న MCLR ప్రభావం అన్ని రకాల రుణాలపై కనిపించనుంది. MCLR పెరుగుదలతో గృహ, ఆటో ఇతర అన్ని రకాల రిటైల్ రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. MCLR అనేది గృహ రుణం కనీస రేటును నిర్ణయిస్తుంది. MCLR రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2016లో ప్రవేశపెట్టింది. ఇంతకుముందు, గృహ రుణ వడ్డీ రేట్లు బేస్ రేటు ఆధారంగా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి