
జీఎస్టీలో 12 శాతం పన్ను స్లాబ్‌ను తొలగించే ప్రణాళికను జీఎస్టీ కౌన్సిల్ త్వరలో పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ శ్లాబ్ నాలుగు నుంచి మూడుకు తగ్గించవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జూన్-చివరిలో లేదా జూలైలో కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో 12 శాతం శ్లాబ్ గురించి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ ఆదాయ తటస్థతను కొనసాగిస్తూ 12 శాతం స్లాబ్‌ను తొలగించడం ద్వారా రేట్లను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం జీఎస్టీ విధానంలో ప్రధానంగా నాలుగు పన్ను శ్లాబులు ఉన్నాయి, 5%, 12%, 18%, 28%. అయితే దీంతో పాటు ఆభరణాలపై కూడా 3 శాతం ఉంది. చాలా మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిపుణులు, జీఓఎం ప్రతినిధులు 12 శాతం GST స్లాబ్‌ను తొలగించే ప్రణాళికను సమర్థించారు. ఈ శ్లాబ్ కిందకు వచ్చే వస్తువులను 5 శాతం లేదా 18 శాతానికికి మార్చవచ్చని నివేదికల్లో స్పష్టం అవుతుంది. ముఖ్యంగా రోజువారీగా ఉపయోగించే సామూహిక వినియోగ వస్తువులను 5 శాతం పన్ను స్లాబ్‌కి మార్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి