ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం జన్ ధన్ యోజన అకౌంట్లను ప్రారంభించింది. అది కూడా జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తీయవచ్చు. ఒక వేళ ఖాతాలో కనీస బ్యాలన్స్ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాంకులు పెనాల్టీ వేయరు. అయితే ఈ ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతా 9 సంవత్సరాలు పూర్తయింది. 2014లో జన్‌ధన్ ఖాతా పథకాన్ని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించింది. పేదలను బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జన్ ధన్ ఖాతాదారుల డేటాను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ ఖాతాదారుల సంఖ్య 50 కోట్లు దాటింది. ఇందులో 56 శాతం ఖాతాలు మహిళల పేరిటే ఉండడం గమనార్హం. అదే సమయంలో 50 కోట్లలో 67 శాతం ఖాతాలు గ్రామాలు, చిన్న పట్టణాల్లో ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.03 లక్షల కోట్లు డిపాజిట్ కాగా, ఈ ఖాతాల నుంచి దాదాపు 34 కోట్ల రూపాయల కార్డులు ఉచితంగా జారీ చేశాయి. ఇలా నెలనెల భారీ సంఖ్యలో ఈ జన్ ధన్ ఖాతాలు తెరుస్తున్నారు. ఈ ఖాతాలు తెరావాలంటే సులభంగానే ఉంటుంది. ఆధార్,
ప్రధాన్ మంత్రి జన్ ధన్ ఖాతాలలో సగటు మొత్తం రూ. 4,076, వీటిలో 5.5 కోట్ల కంటే ఎక్కువ మంది ఖాతాదారులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ప్రయోజనం పొందుతున్నారు.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులు అనేక ప్రయోజనాలను పొందుతారు. మీరు ఈ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా ఉచిత రూపే డెబిట్ కార్డ్, రూ. 2 లక్షల ప్రమాద బీమా, రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఇందులో ఉన్నాయి. గత ఏడాది రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ మాట్లాడుతూ.. నవంబర్ 30 వరకు దేశంలో దాదాపు 47.57 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిచారని, వాటిలో 38.19 కోట్లు కరెంట్ కాగా, 10.79 లక్షలు నకిలీవని లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అంటే లక్షల ఖాతాలు తప్పుగా తెరిచారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తప్పుగా తెరిచిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆ ఖాతాలను సకాలంలో మూసివేయడం సరైనది.
Number of Jan Dhan Accounts Cross 50 Crore
56% Accounts Belong To Women and 67% Accounts Opened In Rural / Semi-urban Areas
Read here: https://t.co/bxLAOmQZGG@FinMinIndia
— PIB India (@PIB_India) August 18, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి