EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు ఆర్జించే వడ్డీ ఆదాయంపై పన్ను విధించే నిబంధనలను మార్చే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ నిబంధనలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమానాలను నివృత్తి చేయనుంది. ఉద్యోగులు సంస్థ లేదా వ్యాపారం నుంచి పొందే వివిధ ప్రయాజనాల విషయంలో TDS విషయమై ఈ రూల్స్ వర్తిస్తాయి.
TDS విషయంలో EPFO సర్క్యులర్ తమ పరిశీలనలో ఉన్న ఒక సమస్య అని ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి కమలేష్ సి వర్ష్నే బుధవారం తెలిపారు. ప్రజలు ఇది ఉపసంహరణ ప్రాతిపదికన ఉండాలని కోరుతున్నారని.. అక్రూవల్ ప్రాతిపదికన కాదని ఆయన తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. ఈ విషయంపై తాను పెద్దగా మాట్లాడలేనని.. నిత్యం చర్చిస్తున్న అంశాల్లో ఇది కూడా ఒక ప్రధాన అంశమని ఆయన తెలిపారు. ఈ విషయంలో జూలై 1లోపు పూర్తి వివరాలు అందిచనున్నట్లు అసోచామ్ సభ్యులతో అన్నారు.
బడ్జెట్ FY23 EPFకి ప్రైవేట్ ఉద్యోగులకు రూ. 2.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 5 లక్షలు కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ పై పన్ను విధించే ఆదాయాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఆదాయ-పన్ను చట్టంలో కొత్త సెక్షన్- 194Rని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక రెసిడెంట్ కి సంవత్సరంలో రూ. 20,000 కంటే ఎక్కువ ఏదైనా ప్రయోజనం లేదా అనుమతులను అందించడం ద్వారా 10 శాతం చొప్పున టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ కట్ అవుతుంది. ఈ నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి వస్తోంది.