Government Scheme: ఈ ప్రభుత్వం కుమార్తెల వివాహనికి రూ.51000 సాయం.. ఎవరెవరు అర్హులంటే..

|

Feb 19, 2023 | 1:49 PM

అనేక ప్రభుత్వ పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించడం జరుగుతుంది. ఈ పథకాల కింద నిరుపేద కుటుంబాలు, నిరుపేదలకు సాయం అందిస్తారు. ప్రతి తరగతి ప్రజల కోసం ప్రభుత్వం పథకాలు అమలు..

Government Scheme: ఈ ప్రభుత్వం కుమార్తెల వివాహనికి రూ.51000 సాయం.. ఎవరెవరు అర్హులంటే..
Government Scheme
Follow us on

అనేక ప్రభుత్వ పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించడం జరుగుతుంది. ఈ పథకాల కింద నిరుపేద కుటుంబాలు, నిరుపేదలకు సాయం అందిస్తారు. ప్రతి తరగతి ప్రజల కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. ఇక అమ్మాయిల పెళ్లికి డబ్బు ఇచ్చే అటువంటి పథకం కూడా ఉంది. ఈ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ పథకం పేరు ఆశీర్వాద్ యోజన. దీనిని గతంలో షాగున్ స్కీమ్ అని పిలిచేవారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల పెళ్లి కోసం కుటుంబానికి రూ.51,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. అయితే ఈ పథకం ప్రయోజనం బాలికలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే ఇస్తారు.

ఈ పథకానికి ఎవరెవరు అర్హులు

ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేయాలనుకుంటే అతను పంజాబ్ నివాసి అయి ఉండాలి. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ శాఖ ఈ పథకం కింద ఎస్సీ,బీసీ, ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) వర్గాలకు చెందిన కుటుంబాలకు ఆడపిల్లల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 51,000 సహాయం అందిస్తుంది. ఇంతకు ముందు ఈ మొత్తం రూ. 21,000 కాగా, జూలై 2021లో రూ. 51,000కి పెంచింది. అయితే కొంత కాలంగా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందడం లేదు. మరోవైపు ఈ పథకం కింద 50,189 మంది లబ్ధిదారులకు త్వరలో 256 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు పంజాబ్ మంత్రి బల్జీత్ కౌర్ చెప్పారు.

ఏ పత్రాలు అవసరం:

ఈ పథకం కింద దరఖాస్తుదారు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు:

  • దరఖాస్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఇప్పుడు వెబ్‌సైట్ ఆశీర్వాద్ యోజన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఆశీర్వాద్ యోజన కోసం దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో మాత్రమే చేయాలి.
  • ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా పూరించండి.
  • ఇప్పుడు ఈ ఫారమ్‌తో అన్ని పత్రాలను అటాచ్ చేయండి.
  • దీని తర్వాత ఫారమ్‌ను సంబంధిత శాఖకు సమర్పించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి