Goutam Adani: గౌతమ్ అదానీ మరో రికార్డ్.. ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి నెంబర్.1 గా ఘనత

ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరో రికార్డు సాధించారు. నికర ఆదాయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించి, ఆసియాలో అపర కుబేరుడిగా నిలిచారు...

Goutam Adani: గౌతమ్ అదానీ మరో రికార్డ్.. ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి నెంబర్.1 గా ఘనత
Adani

Updated on: Feb 08, 2022 | 12:45 PM

ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరో రికార్డు సాధించారు. నికర ఆదాయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించి, ఆసియాలో అపర కుబేరుడిగా నిలిచారు. ప్రపంచంలోని టాప్ 10 సంపన్న వ్యక్తుల ర్యాంకింగ్ లో ఉన్న గౌతమ్ అదానీ $88.5 బిలియన్ల సంపదను కలిగి ఉన్నారు. గౌతమ్ అదానీ సంపద సంవత్సరానికి దాదాపు $12 బిలియన్లు పెరగగా.. ముకేశ్ అంబానీ సంపద $2.07 బిలియన్లకు పడిపోయింది. ప్రముఖ అంతర్జాతీయ కథనం ప్రకారం ముఖేశ్ అంబానీ ప్రస్తుతం భారతదేశ రెండో సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో పదకొండో సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నారని తెలిపింది. ఫిబ్రవరి 8 నాటికి, అంబానీ మొత్తం సంపాదన విలువ $87.9 బిలియన్లు ఉన్నట్లు కథనంలో పేర్కొంది.

గతేడాది నవంబర్‌లో ముకేశ్ అంబానీ భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అప్పుడు గౌతమ్ అదానీ దాదాపు $2.2 బిలియన్లు వెనుకబడి ఉన్నారు. ఆ సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర దాదాపు 18.50% పెరగగా.. ఫిబ్రవరి 8,2022 ఉదయం నాటికి షేరు రూ.2,312.75 వద్ద ట్రేడ్ ఇయింది. దీనితో పోల్చి చూస్తే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 170% పైగా ఎగబాకి, ఫిబ్రవరి 8,2022 ఉదయం నాటికి రూ. 1,741 వద్ద ట్రేడయింది. ప్రస్తుతం మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను అదానీ గ్రూప్ గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ ఘనతను సొంతం చేసుకుందని బ్రోకరేజ్ సంస్థ HDFC సెక్యూరిటీస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ అన్నారు.

Also Read

Jagananna Chedodu: ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్

Malavika Mohanan: బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్తాను.. ప్రామిస్.. కానీ ఆ కండిషన్ అప్లై అంటున్న హీరోయిన్ మాళవిక మోహనన్..

Telangana Crime: భార్యను వదిలించుకునేందుకు భర్త దారుణం.. ఏం చేశాడో తెలిస్తే షాక్